Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTollywood Sankranthi Movies: ఈసారి సంక్రాంతికి ఫన్‌తో బాక్సాఫీస్ షేక్..

Tollywood Sankranthi Movies: ఈసారి సంక్రాంతికి ఫన్‌తో బాక్సాఫీస్ షేక్..

Tollywood Sankranthi Movies: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో పాటు ఇతర సౌత్ సినిమాలకి సంక్రాంతి సీజన్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ సీజన్‌ని టార్గెట్ చేసుకొనే చాలా సినిమాలు రిలీజ్ కి ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. సంక్రాంతి బరిలో దిగాలంటే చాలా గట్స్ కూడా కావాలి. ఒక్క షోతో మొత్తం సినారియో మారిపోతుంది. ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా మన టాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఇతర భాషల స్టార్ హీరోలు కూడా గట్టిగా పోటీ పడబోతున్నారు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర వరప్రసాద్‌ గారు’ సినిమాతో 2026 సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మరో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీ, అనిల్ రావిపూడి స్టైల్లో కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఇప్పటికే, వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో ఏ రేంజ్ కామెడీ ఉండబోతుందో హింట్ ఇచ్చారు. గ్యారెంటీగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధిస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.

Also Read- OG Movie: 250 కోట్ల క్ల‌బ్‌లోకి ఓజీ – బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ అండ్ కామెడీ జానర్ సినిమా ‘ది రాజాసాబ్’. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అటు డార్లింగ్ అభిమానులను.. ఇటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మొదటిసారి ప్రభాస్ కంప్లీట్ కామెడీ హర్రర్ జోనర్ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. దర్శకుడు మారుతి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు రూపొందించడంలో దిట్ట. కాబట్టి, సినిమా సక్సెస్ కి మారుతి పెద్ద ఎస్సెట్ అని చెప్పుకుంటున్నారు. ఇక 2026 సంక్రాంతికి థియేటర్స్‌లో నవ్వులతో అదరగొట్టడానికి రాజాసాబ్ రెడీ అవుతున్నాడు.

మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అనగనగా ఒకరాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ కామెండీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా థియేటర్స్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతోంది. నవీన్ పోలిశెట్టి కామెడీ.. మీనాక్షి గ్లామర్ ‘అనగనగా ఒకరాజు’ సినిమా సక్సెస్‌కి మెయిన్ హైలెట్స్‌గా నిలుస్తాయని ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈసారి సంక్రాంతి కంప్లీట్ కామెండీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో బాక్సాఫీస్ దద్దరిల్లబోతోంది. ఇక మన తెలుగు సినిమాలతో పాటు తమిళంలో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయగన్ కూడా ఉంది.

Also Read- Dussehra: దసరా పండుగ ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు?.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలివే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad