28 Years Later OTT Netflix Streaming: హారర్ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొంతమంది హారర్ చిత్రాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. భయంలోనే థ్రిల్‌ను వెతుక్కుంటారు. అటువంటి వారికి కిక్కిచ్చే భారీ బడ్జెట్ సినిమా నేడు రిలీజైంది. అదే “28 ఇయర్స్ లేటర్” అనే A-రేటెడ్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రం నేడు (శనివారం) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో రెంటల్ గా మాత్రమే లభ్యమైన ఈ చిత్రం, ఇప్పుడు సబ్‌స్క్రైబర్లకు అదనపు చార్జీలు లేకుండా అందుబాటులోకి వచ్చింది. హారర్ ఎలిమెంట్స్ కూడిన ఈ సినిమా అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఓ పోస్ట్-అపోకలిప్టిక్ హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు డ్యానీ బోయిల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం, 2002లో వచ్చిన “28 డేస్ లేటర్”, 2007లో వచ్చిన “28 వీక్స్ లేటర్” తర్వాత వచ్చిన మూడో పార్ట్‌గా రిలీజైంది. భారీ విజయాలను అందుకున్న ఈ చిత్రాలకు కొనసాగింపుగా రావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ఈ మూవీ, $60 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కి $151 మిలియన్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. టెన్షన్, ఎమోషన్, హారర్ మూడింటి కలిపి కథను ఆసక్తికరంగా నడిపించడంతో, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఇందులో ప్రముఖ నటీనటులు జోడీ కోమర్, ఆరోన్ టేలర్ జాన్సన్, ఆల్ఫీ విలియమ్స్, రాల్ఫ్ ఫైన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేయగా, కలంబియా పిక్చర్స్, డెసిబెల్ ఫిలిమ్స్, డిఎన్ఏ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, బుక్ మై షో స్ట్రీమ్, యాపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.
Also Read: https://teluguprabha.net/technology-news/iphone-17-vs-iphone-16-price-and-features-specifications/
రూ. 1331 కోట్లు రాబట్టిన హారర్ మూవీ..
అమెరికన్ హారర్ థ్రిల్లర్ ‘28 ఇయర్స్ లేటర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ 20న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. 60 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా 151.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1331 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. జూన్ 20న థియేటర్లలో రిలీజై ఘన విజయం సాధించింది. ఇప్పుడు సెప్టెంబర్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలోని కొన్ని సీన్లను ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోతో షూట్ చేయడం విశేషం.
కథ ఏమిటంటే?
2002లో ఓ వైరస్ వచ్చి మనుషులంతా రాక్షసుల్లా మారిపోతారు. ఆ రాక్షసులు జనాలను చంపుతారు. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత మరోసారి ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మరి ఇప్పుడు ఆ వైరస్‌ను ఎలా అడ్డుకున్నారు? రాక్షసులుగా మారిన వాళ్ల నుంచి హీరో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే కథ. 28 ఇయర్స్ లేటర్ మూవీకి డ్యానీ బోయ్ లే డైరెక్టన్ చేశారు. ఇందులో జోడీ కార్నర్, ఆరోన్ టేలర్, జాక్ ఓ కానెల్ తదితరులు నటించారు.


