Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMega 157: 3వ షెడ్యూల్ పూర్తి

Mega 157: 3వ షెడ్యూల్ పూర్తి

Mega 157: మెగాస్టార్ చిరంజీవి నుంచి రెండు డిఫరెంట్ జోనర్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి విశ్వంభర. బింబిసార సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మల్లిడి వశిష్ట. ఈ సినిమా చూసి ఏకంగా మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. చాలా ఏళ్ళ తర్వాత సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు చిరు. త్రిష ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కొద్దిపాటి చిత్రీకరణ తప్ప దాదాపు టాకీపార్ట్ మొత్తం పూర్తైంది.

- Advertisement -

చిరు విశ్వంభర లాంటి సోషియో ఫాంటసీ తర్వాత చేస్తున్న పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మెగా 157. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస సక్సెస్‌లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ నుంచి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వరకూ ప్రతీది మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. రవితేజ లాంటి ఫాపుల్లో ఉన్న హీరోకి అనిల్ హిట్ ఇచ్చి ఒడ్డెక్కించాడు.

Also Read – Janhvi kapoor: అల్లు అర్జున్ మూవీ కోసం రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన జాన్వీ – అంత డిమాండ్ చేసిందా?

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఒకదానిని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే, ఈ సినిమాలన్నీ అనిల్.. పూరి జగన్నాధ్ మాదిరిగా పక్కా ప్లాన్ ప్రకారమే చక చకా కంప్లీట్ చేశాడు. అయితే, ప్రస్తుతం మెగాస్టార్ తో చేస్తున్న ఆయన 157వ సినిమాను మాత్రం జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నాడు. అసలు ఇంత స్పీడ్ గా గత చిత్రం ఏదీ అనిల్ చేయలేదు.

2026 సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం.. అంటూ అనిల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారమే శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు మొదలైందో కూడా తెలియడం లేదు. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన చిరు-అనిల్ తాజాగా, 3వ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. దీనికి సంబందించిన అప్‌డేట్ ని కూడా అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన భీంస్ సిసిరోలియో మెగా 157 కి సంగీతం అందిస్తున్నారు. అనిల్ స్పీడ్ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రఫ్ఫాడించడం గ్యారెంటీ అనిపిస్తోంది.

Also Read – Raisin Water: నానబెట్టిన ఎండుద్రాక్ష నీరు ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad