Alia Bhatt National Award Movie: రీసెంట్‌గా పలు సినిమాలు నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఐదు జాతీయ అవార్డులు అందుకున్న ఓ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో నటించింది మరెవరో కాదు.. బాలీవుడ్ భామ అలియా భట్. వైవిధ్యభరిత నాయికా ప్రాధాన్య కథలు ఎంచుకుంటూ, వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఈ ముద్దుగుమ్మ.. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/samantha-ring-photo-sparks-engagement-rumors-with-raj/
ఇంతకీ ఆ సినిమా ఏంటంటే
అలియా భట్ నటించిన హిట్ సినిమాల్లో గంగూబాయి కఠియావాడి ఒకటి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. 1950 – 1960ల మధ్య కాలంలో సాగుతుంది. ముంబయిలోని కామాటిపుర వాతావరణాన్ని, ఆడపిల్లలు అక్కడి వేశ్యా గృహాల్లో బందీలవుతున్న తీరును.. సినిమాలో భావోద్వేగంగా చూపించారు. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో అలియా వేశ్య పాత్రలో నటించడం. వేశ్యా వృత్తిలో మగ్గిపోతున్న మహిళల హక్కుల కోసం, వారి పిల్లలకు విద్యనందించడం కోసం గంగూబాయి చేసిన పోరాటమే ఈ చిత్ర కథ. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కంటే ముందు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
50కు పైగా అవార్డులు..
ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం ఏకంగా 50 అవార్డులను గెలుచుకుందని ఐఎండీబీ వెల్లడించింది. వీటిలో ఐదు జాతీయ అవార్డులు ఉన్నాయి. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా నటనకు గాను ఉత్తమ నటి కేటగిరీలో జాతీయ అవార్డ్ అందుకుంది. అలాగే, ఈ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటర్) గా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇంకా ఈ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్, బెస్ట్ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్), బెస్ట్ ఎడిటింగ్ నేషనల్ అవార్డులు కూడా దక్కాయి. ఐఎండీబీలో 7.8 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా తెలుగులోనూ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.


