Trisha Toser : సాధారణంగా పెద్దపెద్ద తారలు, అనుభవజ్ఞులైన నటీనటులు, దర్శకులు జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలలో మెరిసిపోతుంటారు. కానీ, ఈసారి 71వ జాతీయ అవార్డుల వేడుకల్లో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు, ఐదేళ్ల వయసులోనే ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకున్న త్రిష తోసర్.
జాతీయ వేదికపై చిన్నారి హుందాతనం
సెప్టెంబర్ 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా త్రిష అవార్డు అందుకునే దృశ్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిన్నారి ముఖంలో కనిపించిన చిరునవ్వు, ఆత్మవిశ్వాసం, హుందాతనం అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు “గూస్ బంప్స్ మూమెంట్స్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, షారుఖ్ ఖాన్‌కు ఉత్తమ నటుడి పురస్కారం వంటి విషయాలు సంచలనంగా మారగా, త్రిష ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
#WATCH | Delhi: 71st National Film Awards | Child Artist Treesha Thosar says, "It felt great. The President congratulated me…"
Treesha Thosar received the Best Child Artist award at the 71st National Film Awards for her performance in the Marathi film "Naal 2." pic.twitter.com/xSVJh5iB4j
— ANI (@ANI) September 23, 2025
Chandrababu: సీఎంకు సీఐ నోటీసులు: సంచలనం రేపుతున్న పరువు నష్టం కేసు
చిన్నారి త్రిష ప్రయాణం
త్రిష తోసర్ కేవలం ఈ అవార్డుతోనే కాదు, అంతకుముందు కూడా బాలనటిగా తన ప్రతిభను చాటుకుంది. ఆమె హిందీ చిత్రాలతో పాటు, ప్రఖ్యాత దర్శకులు మహేష్ మంజ్రేకర్, నటుడు సిద్ధార్థ్ జాదవ్ వంటివారితో కలిసి పనిచేసింది. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో వచ్చిన “పున్హా శివాజీరాజే భోసలే” చిత్రంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది. త్రిషతో పాటు, ఈసారి మొత్తం ఐదుగురు చిన్నారులు (శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్, కబీర్ ఖండారే, సుకృతి వేణి బండ్రెడ్డి) ఉత్తమ బాల నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.


