Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSankranthiki Vasthunam: 92 సెంటర్లలో 50 రోజులు

Sankranthiki Vasthunam: 92 సెంటర్లలో 50 రోజులు

విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్‌బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి వసూళ్ల సునామి సృష్టించింది.

- Advertisement -

ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈచిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్‌, హ‌నుమాన్ రికార్డుల‌ను బ్రేక్ చేసింది. కేవ‌లం 12 గంట‌ల్లో 100 ఫ్ల‌స్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ న‌మోదు కాగా.. 1.3 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఆఈ మూవీ నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 92 సెంటర్స్‌లో 50 రోజులు ఆడటం విశేషం. మొత్తానికి ఇటీవల కాలంలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్‌లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad