Mahesh Babu did 5000 Heart Operations: టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఇద్దరు పిల్లల తండ్రి. వయసు 50కి దగ్గర్లో ఉన్నా ఇంకా ఇరవై ఏళ్ల యువకుడిలా కనిపిస్తారు. అందుకే ఇప్పటికీ ఆయనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఆయన అందానికి మాత్రమే పడిపోవడం కాదు మంచి మనసుకి కూడా. ఇప్పటివరకూ దాదాపు 5000కి పైగా చిన్నారుల గుండెకి ప్రాణం పోసి రియల్ హీరోగా నిలిచాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్. ఇక అసలు విషయానికొస్తే మహేష్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ప్రధానమైనది చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించడానికి సహాయం చేస్తున్నాడు.
Also Read: https://teluguprabha.net/telangana-news/hmd-negligence-ghatkesar-land-encroachment-100-crore/
మహేష్ దంపతులకు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్ ఉండటంతో చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి సర్జరీ చేయించాడు. ‘నాకు డబ్బు ఉంది కాబట్టి కొడుకును కాపాడుకోగలిగా.. కానీ నిరుపేదల పిల్లలకు ఇలాంటి పరిస్థితి తలెత్తితే వారి భవిష్యత్తు ఏంటి?’ అని ఆలోచన మహేష్‌కు రావడంతో ఇంతటి గొప్ప మహత్కర కార్యానికి పునాదికి పడింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/new-tollywood-heroines-are-looking-for-success/
గుండె జబ్బులు ఉండి ఆర్థికంగా చికిత్స చేయించుకోలేని చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నాడు. అలా ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించి వారి తల్లిదండ్రుల జీవితాల్లో సంతోషం నింపాడు. ఇదిలా ఉంటే నేటితో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 5000 ఉచిత హార్ట్ సర్జరీలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మహేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు దేవుడివి సామీ.. నీ సాయం ఇలాగే కొనసాగని అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


