Allu Arjun – Deepika Padukone: పుష్ప లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఐకాన్ స్టార్ రేంజ్ ఎమతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలలో బన్నీ క్యారెక్టర్‌కి గానూ ఇటీవల గద్దర్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇక ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి ఇది 22వ సినిమా కాగా, అట్లీకి 6వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ఇప్పటికే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఎంపికయ్యారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించినప్పటి నుంచి ముగ్గురు హీరోయిన్లకి స్క్రీన్ స్పేస్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చాలామంది క్రేజీ బ్యూటీస్ పేర్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీపిక కాకుండా మరో ఇద్దరు కూడా ఫైనల్ అయ్యారని కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హెవీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని అల్లు అర్జున్, దీపికలను పరిచయం చేస్తూ వదిలిన వీడియోలు చూస్తే అర్థమైంది. కానీ, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే ముంబైలో ఈ మూవీ తొలి షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారట. మూడు నెలల పాటు ముంబైలోనే షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో మెయిన్ యాక్షన్ సీక్వెన్సులను కంపోజ్ చేస్తారని టాక్. ఇక తాజా సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ ని సెకెండ్ లీడ్ గానూ, థర్డ్ లీడ్ లో జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలపై అట్లీ టెస్ట్ షూట్ నిర్వహించి ఫైనల్ గా సెలెక్ట్ చేశాడట.
దీపిక, మృణాల్, జాన్వీ కపూర్..వీరంతా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్. అలాగే ముగ్గురికీ సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇక పాన్ ఇండియా వైడ్‌గానూ దీపికకి పాపులారిటీ ఉంది. ఈ సినిమాలో ఈ గ్లామర్ బ్యూటీస్ ముగ్గురు ఒకే ప్రేమ్ లో కనిపిస్తే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో ఊహకందదు. ఇప్పటి వరకూ ఈ త్రయం కలిసి ఒకే సినిమాలో నటించ లేదు. పర్ఫార్మెన్స్ లో ఎవరికి వారే సపరేట్ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు. కాకపోతే వీళ్లిద్దరికంటే దీపిక సీనియర్. ఏదేమైనా బన్నీ సినిమాలో ఇలాంటి హాట్ హీరోయిన్స్ ఉంటే పాన్ వరల్డ్ సినిమాకి వచ్చే రేంజ్ టన్నుల్లో ఉంటుంది. మరి అధికారికంగా వీరి వీడియోలను ఎప్పుడు వదులుతారో చూడాలి.