Sunday, November 16, 2025
HomeTop StoriesAA22A6: అల్లు అర్జున్, అట్లీ మూవీపై బాలీవుడ్ హీరో సెన్షేషనల్ కామెంట్స్..

AA22A6: అల్లు అర్జున్, అట్లీ మూవీపై బాలీవుడ్ హీరో సెన్షేషనల్ కామెంట్స్..

AA22A6: అల్లు అర్జున్, అట్లీ మూవీపై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ సెన్షేషనల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పుష్ప ఫ్రాంఛైజీతో గ్లోబల్ స్టార్ గా మారిన బన్నీ, నేషనల్ అవార్డ్ ని కూడా దక్కించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు రెండు బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లని రాబట్టాయి. దాంతో అల్లు అర్జున్ అంతకుమించి ఉండాలనే పక్కా ప్లాన్ తో హాలీవుడ్ రేంజ్ లో ఉండే కథనే ఎంచుకున్నారు.

- Advertisement -

యంగ్ డైరెక్టర్ అట్లీ తమిళంలో తీసింది కేవలం 6 సినిమాలే. కానీ, ఆ 6 సినిమాలు వేటికవే చాలా ప్రత్యేకం. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి భారీ హిట్ ఇచ్చారు. ఈ సినిమాతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార హిందీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాతో అట్లీ దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ అందుకున్నారు. కానీ, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసేందుకు ఏకంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకోవడం, ఆ కథతో బన్నీని ఒప్పించడం అంతా గోప్యంగా జరిగిపోయాయి.

Also Read – Sharwanand: బైక్ రేస‌ర్‌గా శ‌ర్వానంద్ – ఎట్ట‌కేల‌కు టైటిల్ రివీల్ చేసిన యూవీ క్రియేష‌న్స్‌…

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే, ముంబైలో ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్ కోసం వేసిన సెట్ అద్భుతంగా ఉందనే విషయాన్ని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తెలిపారు. బన్నీ సినిమాతో ఓ అద్భుతమైన ప్రపంచాన్ని అట్లీ చూపించబోతున్నట్టుగా ఆయన తెలిపాడు. కాగా, ఇటీవల రణ్‌వీర్ ఈ మూవీ షూటింగ్ సమయంలో కాసేపు సెట్లో సందడి చేశారు.

ఇక, ఈ సినిమా కథ మాఫీయా బ్యాక్‌డ్రాప్ లో సాగుతుందట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అల్లు అర్జున్, దీపికల ఇంట్రో వీడియోస్ బాగా సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో చేస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీతో ఎన్ని సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read – Bhagyashri Borse: భాగ్య‌శ్రీ బోర్సే డ‌బుల్ ట్రీట్ – ఒకే నెల‌లో రెండు సినిమాలు రిలీజ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad