Tuesday, December 3, 2024
Homeచిత్ర ప్రభIra Khan: ఫిట్‌నెస్ ట్రైనర్‌తో అమీర్ కూతురి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్

Ira Khan: ఫిట్‌నెస్ ట్రైనర్‌తో అమీర్ కూతురి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్

- Advertisement -

Ira Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన సోషల్ మీడియాలో పెట్టే బోల్డ్ ఫొటోలతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తండ్రితో సంబంధం లేకుండా తన ఫొటోలతోనే ఫేమస్ అయింది ఐరా ఖాన్. గత రెండేళ్ల నుంచి ఐరా ఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్, ప్రముఖ సైక్లిస్ట్ నుపుర్ శిఖర్ తో ప్రేమాయణం సాగిస్తుంది. ఇప్పుటికే అధికారికంగా చాలా సార్లు వీరిద్దరి ఫోటోలని ఐరా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక ముంబైలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ బాలీవుడ్ మీడియాకి పలుమార్లు చిక్కారు. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల ఓ సైక్లింగ్ ఈవెంట్ లో నుపుర్ ఐరాకి పబ్లిక్ గా అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఐరా ఆ ప్రపోజల్ ని ఒప్పుకొని అందరిముందు నుపుర్ కి లిప్ కిస్ కూడా ఇచ్చింది

ఇక ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో తాజాగా శుక్రవారం నాడు నుపుర్, ఐరాల నిశితార్థం ముంబైలో ఘనంగా జరిగింది. రెండు కుటుంబాలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నుపుర్, ఐరా స్నేహితులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. దీంతో బాలీవుడ్ లో నుపుర్, ఐరా ఎంగేజ్మెంట్ వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News