‘లాల్ సింగ్ చద్ధా’ ఫ్లాప్ అయినా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కు మాత్రం ఆ సినిమా మత్తు ఇంకా దిగటం లేదు. ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమా రీమేక్ గా బాలీవుడ్లో లాల్ సింగ్ చద్ధా పేరుతో తీసిన అమీర్ ఖాన్ ఆ సినిమాను ఫారెస్ట్ గంప్ హీరో టాం హ్యాంక్స్ కోసం ప్రత్యేకంగా సినిమా ప్రదర్శించనున్నారు. ఇందుకోసం అమీర్ ఏకంగా అమెరికాకు స్వయంగా వెళ్లి వెటరన్ హీరో టాం హ్యాంక్స్ కు స్పెషల్ గా లాల్ సింగ్ చూపించి తన అభిప్రాయం చెప్పమని కోరనున్నారు. మన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. 180 కోట్లకు పైగా పెట్టి తీసిన ఈసినిమాకు వసూళ్లు 40 కోట్లు కూడా దాటలేదని సమాచారం. ‘బాయ్ కాట్’ సెగతోపాటు సినిమా ఏమాత్రం బాగాలేక పోవటంతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
Aamir-Tom Hanks: అమీర్ కు ‘లాల్ సింగ్’ మైకం దిగట్లేదు, స్పెషల్ స్క్రీనింగ్ అట
సంబంధిత వార్తలు | RELATED ARTICLES