Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభAccident in Movie Shooting : స్టార్ హీరో సినిమా షూటింగ్ లో విషాదం.. మరణించిన...

Accident in Movie Shooting : స్టార్ హీరో సినిమా షూటింగ్ లో విషాదం.. మరణించిన ఫైటర్..

- Advertisement -

Accident in Movie Shooting : తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమార‌న్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కమెడియన్ సూరిలు హీరోలుగా ‘విడుద‌లై’ సినిమా తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదటి భాగాన్ని జనవరి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. చెన్నైలో సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఫైట్ నిమిత్తం భారీ క్రేన్ కి ఫైటర్స్ ని తాళ్లతో కట్టి షూటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ సురేష్‌కు క‌ట్టిన తాడు తెగిపోయింది. దీంతో సుమారు 20 అడుగుల పైనుంచి కింద పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ అతన్ని ఆసుపత్రికి తరలించగా దారి మధ్యలోనే మరణించాడు. దీంతో చిత్ర యూనిట్ లో, తమిళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ ని నిలిపివేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News