Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAli: రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ ఏమన్నారంటే..?

Ali: రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ ఏమన్నారంటే..?

ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమంలో ప్రముఖ నటుడు అలీని(Ali) ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదంపై అలీ స్పందించారు.

- Advertisement -

“కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారికి మాట తూలింది. ఆయన సరదాగా అన్నారు. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ మంచి కళాకారుడని, ప్రస్తుతం ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు అమ్మ లాంటి కూతురు చనిపోయింది. ఆయన భావోద్వేగ స్థితిలో ఉన్నారు. దయచేసి ఆయన మానసిక స్థితిని అందరూ అర్థం చేసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలను రాజేంద్రప్రసాద్ సమర్థించుకున్నారు. అన్నయ్య లాంటోడిని కాబట్టి సరదాగా అలా వ్యాఖ్యానించానని.. తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad