Ravi Mohan: గత కొన్ని నెలలుగా నటుడు జయం రవి (Jayam Ravi) కొన్ని వ్యక్తిగత కారణాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. హీరోగా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల కారణంగా మీడియాకు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారుతున్నారు. ఇటీవల ఆయన తన భార్య ఆర్తికి (Arti) విడాకులు ఇస్తూ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆర్తి సైతం తన అనుమతి తీసుకోకుండానే జయం రవి ఇలాంటి ప్రకటన చేశారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ (Kenishaa Francis)తో జయం రవి రిలేషన్ షిప్‌లో ఉండటవ వల్లే ఆర్తితో విడాకులకు కారణమని వార్తలు కూడా వినిపించాయి. మరో వైపు కెనీషా తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ, జయం రవి ఎక్కడ కనిపించినా కెనీషా ఉండటంతో ఆర్తి పోస్టులకు కెనీషా రిప్లై ఇవ్వడం వంటివి నెటిజన్లలో అనుమానాలకు దారి తీశాయి. అంతేకాదు, ఇటీవల జయం రవి, కెనీషా ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమాల కారణంగా కూడా జయం రవి వార్తల్లో నిలిచారు. ఒక చిత్ర నిర్మాణ సంస్థ తనకు రూ.9 కోట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
Also Read – Jammu: మహిళా డాక్టర్ పై విచక్షణారహితంగా రోగి బంధువులు దాడి.. వీడియో ఇదిగో!
తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన నిర్మాణ సంస్థ బాబీ గోల్డ్ టచ్ యూనివర్సల్ ప్రై.లి సంస్థ గతంలో జయం రవితో రెండు సినిమాలు చేయటానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఒప్పందం మేరకు సదరు నిర్మాణ సంస్థ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. అయితే జయం రవి తమ సంస్థలో సినిమాలు చేయకుండా ఇతర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్నారని ఆరోపించింది. అలాగే తాము ఇచ్చిన అడ్వాన్స్‌ను వడ్డీతో సహా రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలంటూ సదరు నిర్మాణ సంస్థ చెన్నై సిటీ కోర్టులో పిటిషన్ వేసింది.
అయితే దీనికి జయం రవి కూడా నిర్మాణ సంస్థపై చెన్నై హైకోర్టులో రివర్స్ పిటిషన్ (Reverse Petition) వేశారు. తన పిటిషన్‌లో తాను కేటాయించిన కాల్ షీట్స్‌ను బాబీ గోల్డ్ టచ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉపయోగించుకోలేదని జయం రవి పేర్కొన్నారు. అయినప్పటికీ తాను ఆ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇస్తానని చెప్పానని తెలిపారు. అంతేకాదు, వారం రోజుల్లోనే అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి అని ఆ నిర్మాణ సంస్థ తనపై ఒత్తిడి చేసిందని కూడా జయం రవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read – Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై తీవ్రంగా మండిపడ్డ బ్రియాన్ లారా
జయం రవి తన వాదనలో తాను కేటాయించిన కాల్ షీట్స్‌ను ఉపయోగించుకోకుండా తన సమయాన్ని వృధా చేశారని, దీని వల్ల తనకు భారీ నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ సినిమాకి ఒప్పుకోవడం వల్ల తాను మరో సినిమా కాల్ షీట్స్ ఇవ్వలేకపోయానని, దీని ఫలితంగా ఆ నిర్మాణ సంస్థ తనకు రూ.9 కోట్లు నష్టపరిహారం (Compensation) చెల్లించాలని జయం రవి హైకోర్టును కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి చివరకు ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.


