Actor Naresh New Home: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రల్లో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా సంగతేమో కానీ.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. కన్నడ నటి పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఈ జంట తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా నరేష్ విజయ్ కృష్ణ, పవిత్రల కొత్త ఇల్లు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సొంతంగా కట్టుకున్న ఈ ఇంటి గృహప్రవేశ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read – viral video: బైక్ పై రొమాంటిక్ స్టంట్.. ప్రేమ జంటకు రూ. 50 వేల ఫైన్..
నరేష్ నిర్మించుకున్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన వైరల్ వీడియో చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. కేవలం ఇల్లు కాదు అదొక అద్భుతమైన ఇంద్రభవనంలా కనిపిస్తుంది. ఏకంగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో రాజభవనం లాంటి ఓ ప్యాలెస్‌ను ఆయన నిర్మించారు. ఇంటి ప్రవేశ ద్వారం (ఎంట్రన్స్) నుంచి మొదలుకుని, మాస్టర్ బెడ్ రూమ్‌లు, విశాలమైన కిచెన్, అత్యాధునిక జిమ్ స్పేస్, అందమైన వరండాలు.. ఇలా ప్రతి అడుగులోనూ ఈ ఇల్లు అద్భుతంగా ఉంది. ఈ ఇంటిని చూసి సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. నెటిజన్లు కూడా ‘నరేష్ ఇల్లు అద్భుతం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నటుడు నరేష్ ఇంటిని చూశారా ? ఇంద్రభవనమే.. #Naresh #PavitaLokesh #LuxuryHome @ItsActorNaresh pic.twitter.com/zwr0DhcRBB
— Megha (@MovieloverMegha) August 23, 2025
నరేష్.. దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చారు. తల్లి నుంచి సంక్రమించిన ఆస్తులు విలువ భారీగా పెరగటంతో ఆయనకు డబ్బుకు డోకా లేకుండా పోయింది. సినీ సర్కిల్స్ సమాచారం మేరకు, ఆయన ఆస్తుల విలువ 400 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. విజయ నిర్మల సంపాదించిన విప్రో సర్కిల్ సమీపంలోని ఐదు ఎకరాల ఫాం హౌస్ విలువ సుమారు 300 కోట్లు. అంతేకాకుండా మొయినాబాద్, శంకరపల్లి ప్రాంతాల్లో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఫాం హౌస్‌లు ఉన్నాయి. వీటి ఖరీదు 100 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్న డిబొడ్డున ఈ ఖరీదైన కొత్త ఇంటిని నిర్మించడంతో ఆయన ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
నరేష్‌తో పాటు ఆయన సతీమణి పవిత్ర లోకేష్ కూడా కర్ణాటకలో గణనీయమైన ఆస్తులను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. నరేష్ నిర్మించిన కొత్త ఇంట్లో ప్రస్తుతానికి నరేష్, పవిత్ర మాత్రమే నివసిస్తున్నారని సమాచారం.
Also Read – Paracetamol: గర్భధారణలో పారాసెటమాల్ వాడకం: శిశువులలో ఆటిజం!


