Bandla Ganesh: స్టేజ్ ఎక్కితే అదిరిపోయేలా, ప్రేక్షకులు మరచిపోలేని రేంజ్‌లో సెన్సేషనల్‌గా స్పీచ్‌లిచ్చే తెలుగు సినిమా సెలబ్రిటీస్‌లో బండ్లగణేష్ ఒకడనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన సోషల్ మీడియాలో తనదైన స్పీచ్‌తో వైరల్ అవుతున్నారు. అయితే ఈసారి ఆయన వ్యక్తి గురించి కాకుండా చిన్న సినిమాలకు సపోర్ట్‌గా తన బాణీని వినిపించటం ఇక్కడ కొసమెరుపు. మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేటర్లలో విడుదల చేశారు ఎంటైర్ ఇండస్ట్రీ ఈ మూవీ సక్సెస్‌పై సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. చిన్న సినిమాగా విడుదలై ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టిన ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ‘సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ’ పేరుతో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
Also Read- Regena Cassandrra: ఉప్పొంగే ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న రెజీనా
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘ఏడెనిమిదేళ్ల తర్వాత నాకు కిక్ ఇచ్చిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. అంతకు ముందు నేనెప్పుడూ మౌళి పోస్టర్ కూడా చూడలేదు. కష్టాలు, బాధలు అన్నింటికీ ప్రిపేర్ అయితేనే ఇండస్ట్రీకి రావాలి. ఒకరు స్టార్ కమెడియన్‌కి కొడుకుగా పుడతాడు.. మెగాస్టార్ బావమరిది అవుతారు.. ఐకాన్ స్టార్‌కి తండ్రి అవుతారు. కానీ వంద కోట్లలో ఒకరే అలా ఉంటారు. అందరూ అలా కాలేరు. మనం అందరం కష్టపడాల్సిందే. ఆయన అనుకున్నవాడికి అందుబాటులోకి వెళతాడు. కాలు మీద కాలేసుకుంటాడు. అంతటి మహార్జాతకుడిని నేను చూడలేదు.. చూడను కూడా. అలాంటి వ్యక్తి అల్లు అరవింద్‌గారు ఈ వేడుకకి రావటం ఆనందంగా ఉంది.
చిన్న సినిమా చచ్చిపోయింది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అని అనుకుంటున్న తెలుగు సినీ ఇండస్ట్రీలోకి.. మంచి కథతో సినిమా తీస్తే హిట్ అవుతుందని, భారీ బడ్జెట్‌తో కాదని నిరూపించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఈ సినిమాను రెండున్నర కోట్లతో తీశారు. చిన్న సినిమాలు చూడరు. పెద్ద హీరో, 500 కోట్ల సినిమా అయితేనే చూస్తారనే రోజుల్లో రెండున్నర కోట్లతో సినిమా తీశారు. ఓ పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకుని మూడు నాలుగు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు ఖర్చవుతుంది. అలాంటి రెండున్నర కోట్ల రూపాయలతో చేసిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా రూ.50 కోట్లు కలెక్ట్ చేసిందంటే హ్యాట్సాఫ్ టు టీమ్. మిమ్మల్ని చూసి పెద్ద దర్శకులు, నిర్మాతలు, నాతో సహా అందరూ తలలు దించుకోవాలి. యావత్ తెలుగు ఆడియెన్స్‌ని థియేటర్స్‌కి పరుగులెత్తించారు.
Also Read- Anupama Parameswaran: రొమాన్స్‌లో ‘పరదా’ తొలిగించిన అనుపమ.. అందాల ఆరబోతకు గ్రీన్‌సిగ్నల్..!
నేను థియేటర్‌లో సినిమా చూసి దాదాపు ఐదేళ్లవుతుంది. ఈ మధ్య ఫస్ట్ డే చూడాలనుకున్న సినిమా మిరాయ్. తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ గురించి విని వంశీని అడిగి మరీ సినిమా చూశాను. దీనమ్మ ఇది కదా సినిమా అంటే అనిపించింది. మానాన్నకు, నాకు జరిగిన స్టోరీ. ఇందులో హీరో కంటే ఎక్కువగా మానాన్నకు అబద్దాలు చెప్పేవాడిని. ఇలాంటి సినిమాలు సంవత్సరానికి 12 వస్తే..ఇండస్ట్రీ వందేళ్లు చల్లగా ఉంటుంది. 100 కోట్లు, 500 కోట్లు సినిమాలు కాదు.. థియేటర్స్‌కి జనాలను రప్పించే సినిమాలు తీయండి’’ అన్నారు.


