డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’(Kannappa) మూవీ గ్రాండ్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మూవీ పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మరింతగా పెంచేసింది.
ఈ క్రమంలో తాజాగా సీనియర్ నటుడు రఘుబాబు(Raghu Babu) పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కన్నప్ప చిత్రంలో మల్లు అనే ఓ పాత్రను రఘుబాబు పోషించారు. ఈ పాత్రను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రఘుబాబు ఈ పోస్టర్లో ఆగ్రహంగా కనిపిస్తున్నారు. చూస్తుంటే ఏదో యాక్షన్ సీన్‌కి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రుద్రుడిగా ప్రభాస్, శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సంసిద్దం అవుతోంది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.