Ram Charan – Upasana: మెగా ఫ్యామిలీతో మళ్లీ సంతోషాలు వెల్లి విరిశాయి. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. మరోసారి వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా తన సోషల్ మీడియాలో ఉపాసన పోస్ట్ చేసిన క్యూట్ వీడియోతో ఈ విషయం రివీల్ అయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో కుటుంబ సభ్యులు ఆమె స్వీట్స్ తినిపిస్తున్నారు. ఈ వీడియోతో డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకలో వెంకటేష్ దంపతులు, నాగార్జున దంపతులతో పాటు నయనతార దంపతులు కూడా పాల్గొన్నారు.
ఈ ఏడాది దీపావళి పండుగను మెగా ఫ్యామిలీ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకలకు నాగార్జున, అమల, వెంకటేష్ దంపతులతో పాటు నయనతార, విఘ్నేష్ శివన్ కూడా హాజరయ్యారు. ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా షేర్ చేసిన వీడియోలో వీరందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు.
Also Read – AP Cyclone Threat : ముంచుకొస్తున్న పెను ప్రమాదం.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
రామ్ చరణ్, ఉపాసనలకు 2012లో వివాహం జరిగితే 2023లో కీంక్లార పుట్టింది. ఇప్పటి వరకు ఆ పాప ముఖాన్ని ఎవరినీ వీళ్లు చూపించలేదు. సీక్రెట్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఫలానా వాళ్ల అమ్మాయి అని తెలిస్తే తెలియని ప్రెజర్ ఉంటుందని, కాబట్టి ఆ పాపకు ప్రైవసీని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నానని ఆ మధ్య ఓసారి చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే.
This Diwali was all about double the celebration, double the love & double the blessings.
🙏🙏 pic.twitter.com/YuSYmL82dd— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025
Also Read – Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రీట్ – ఫౌజీ ఫస్ట్‌లుక్ రిలీజ్ – సోల్జర్‌గా రెబల్‌స్టార్


