నటి అభినయ(Abhinaya) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వేగేశ్న కార్తీక్ అనే వ్యక్తితో వివాహం కాబోతున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించింది. మార్చి 9న వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వెల్లడించింది. కార్తీక్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మల్టీ నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు అని గత 15 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం.
పుట్టుకతోనే చెవిటి, మూగ అయినా అభినయ సినిమాల్లో తన అభినయంతో ఆకట్టుకుంది. కింగ్, నేనింతే, శంభో శివ శంభో, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజు గారి గాది2 వంటి సినిమాలో నటించి మంచి పాత్ర సంపాందించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ సినిమాలు చేశారు. ఇటీవల హీరో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఆ వార్తలను అభినయ ఖండించింది.
