Saturday, November 15, 2025
HomeTop StoriesAnu emmanuel: అను బేబికి రీ ఎంట్రీ అయినా క‌లిసొస్తుందా?

Anu emmanuel: అను బేబికి రీ ఎంట్రీ అయినా క‌లిసొస్తుందా?

Anu emmanuel: కొంత మంది హీరోయిన్స్‌కి గ్లామ‌ర్ ఉన్నా, పెర్ఫామెన్స్ పాత్ర‌లు చేసిన ఎందుక‌నో ల‌క్ మాత్రం క‌లిసి రాదు. అలాంటి వారిలో అను ఇమ్మాన్యుయేల్ ఒక‌టి. తెలుగు ప్రేక్ష‌కుల‌ను మ‌జ్ను చిత్రంతో ప‌ల‌క‌రించిన ఈ సొగ‌స‌రి త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. అయితే ఈమె కెరీర్‌లో మ‌జ్ను మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ హిట్ మూవీగా నిలిచిపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, ర‌వితేజ, నాని, నాగ‌చైత‌న్య‌ .. వంటి హీరోల‌తో న‌టించిన‌ప్ప‌టికీ అమ్మ‌డికి అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు.

- Advertisement -

అను బేబికి కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ అని చెప్పుకోవ‌టానికి ఒక సినిమా కూడా లేదు. తెలుగులో ఆమె రవితేజ రావ‌ణాసుర చిత్రంలో న‌టించిన త‌ర్వాత మ‌రో సినిమాలో యాక్ట్ చేయ‌లేదు. ఇక కోలీవుడ్‌లో జ‌పాన్ అనే మూవీలో కార్తితో క‌లిసి న‌టించింది. ఈ రెండు సినిమాలు 2023లోనే రిలీజ్ అయ్యాయి. రెండు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చెప్పుకునేంత గొప్ప విజ‌యాల‌ను అందుకోలేదు. దీంతో ఈ బ్యూటీకి ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డిపోయింది. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోలు ఈమెను ప‌ట్టించుకోవ‌టం మానేశారు.

Also Read – Kantara: కష్టం అంటే ఇది.. ‘కాంతార’ కోసం రిషబ్ శెట్టి పడిన 6 గంటల తిప్పలు!

అయితే రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌వంబ‌ర్ 7న విడుద‌ల కాబోతున్న ‘ది గ‌ర్ల్ ఫ్రెండ్’ సినిమాలో ఈ గ్లామ‌ర్ డాల్ న‌టించింది. దుర్గ అనే బోల్డ్ పాత్ర‌లో కనిపించ‌నుంది. ఆమె లుక్‌ను కూడా ఆ మ‌ధ్య మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అను లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. మ‌రి ఆమె పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న మెయిన్ లీడ్‌గా క‌నిపించనుంది. ఆమెకు జోడీ దీక్షిత్ శెట్టి న‌టించాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్ సినిమాను డైరెక్ట్ చేశాడు.

మ‌రి ది గ‌ర్ల్ ఫ్రెండ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న అను ఇమ్మాన్యుయేల్‌కి ఆ సినిమా అయినా క‌లిసి వ‌స్తుందా? అని చూడాలి. త‌న పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కితే మ‌ళ్లి అవ‌కాశాల‌ను అందుకోవచ్చున‌నేది అమ్మ‌డి ఆశ‌. మ‌రి నెర‌వేరుతుందో లేదో చూడాలి మ‌రి.

Also Read – Sreeleela: కేజీఎఫ్ సినిమాటోగ్రాఫ‌ర్ పెళ్లిలో శ్రీలీల సంద‌డి – ఈ కెమెరామెన్‌తో ఉన్న రిలేష‌న్ ఇదేన‌ట‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad