Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAnushka: చీ.. చీ.. ఇదేం పాడు పని.. వ్యభిచారం కేసులో హీరోయిన్ అరెస్ట్

Anushka: చీ.. చీ.. ఇదేం పాడు పని.. వ్యభిచారం కేసులో హీరోయిన్ అరెస్ట్

Anushka: ఇండస్ట్రీలోకి రావాలనుకున్న, కొత్తగా అడుగు పెడుతున్న యువతులను డబ్బు ఎరగా చూపించి వ్యభిచారం చేయిస్తోన్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యాక్టింగ్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నడుపుతున్న బెంగాలీ నటి అనుష్క మోని మోహన్ దాస్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టి, డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈ సంచలన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 41 ఏళ్ల అనుష్క మోని మోహన్‌దాస్‌ అనే నటి కొంతకాలంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తనతో పాటు పనిచేసే, అవకాశాల కోసం ఎదురుచూసే యువ నటీమణులను లక్ష్యంగా చేసుకుని వారిని ఈ ఊబిలోకి దింపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న థానే పోలీసులు, నిందితురాలిని పట్టుకోవడానికి పక్కా ప్రణాళిక రచించారు.

- Advertisement -

Read Also: Asia Cup: ఆ ఐదుగురికి నిరాశేనా? ఒక్కమ్యాచ్ కూడా ఆడలేరా?

పక్కా ప్లాన్ తో రైడ్..

అందుకోసం, పక్కా ప్రాన్ తో రైడ్ చేశారు. ఇద్దరు పోలీసు సిబ్బందిని డెకాయ్ కస్టమర్లుగా అనుష్క వద్దకు పంపించారు. వారు సంప్రదించగా, అనుష్క డీల్ ఖరారు చేసింది. వారు డబ్బు ఇస్తుండగా, ముందుగానే సిద్ధంగా ఉన్న పోలీసు బృందం ఒక్కసారిగా దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈ దాడిలో టీవీ సీరియళ్లు, బెంగాలీ సినిమాల్లో నటిస్తున్న ఇద్దరు మహిళలను రక్షించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ మీడియాకు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 Read Also: Rithu Chowdary: బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ బ్యూటీ.. డ్యాన్స్ తో ఎంట్రీ..!

గతంలోనూ..

అయితే సినీ ఇండస్ట్రీలో కొందరు నటీమణులు గతంలోనూ వ్యభిచార కేసుల్లో ఇరుక్కున్న సందర్బాలున్నాయి. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న శ్వేతా బసు ప్రసాద్ కొన్నాళ్ల క్రితం వ్యభిచారం కేసులో దొరికినట్లు వార్తలొచ్చాయి. ఆమెకు సంబంధించిన ఓ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. అలాగే సీనియర్ నటీమణులు కిన్నెర, యమున, వినీతలపైనా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు వేసే భువనేశ్వరి కూడా వ్యభిచార కేసుల్లో ఇరుక్కుంది. తాజాగా అనుష్క మోని వ్యభిచార కేసులో అరెస్ట్ కావడంతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad