The Paradise: తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే తనదైన ముద్ర వేసుకుంటున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). వరుస ఆఫర్లతో, ముఖ్యంగా అగ్ర హీరోల పక్కన అవకాశాలతో ఈ అమ్మడు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా, భాగ్యశ్రీ అందం మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి ‘కింగ్డమ్’ (Kingdom) సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది భాగ్యశ్రీ బోర్సే. అంతేకాకుండా, రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా చేస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో (Andhra King Taluka) కూడా ఈమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ పోతినేనితో డేటింగ్ చేస్తోందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. మరోవైపు, అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ (Lenin) సినిమాలో కూడా భాగ్యశ్రీనే ఎంపిక చేసినట్లు సమాచారం. నిజానికి ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీకి (Bhagyashri) నటించనుందని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Also Read – Tollywood: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర.. ఒక్క రోజే ఎనిమిది సినిమాలు రిలీజ్
ఇలా వరుసగా యంగ్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా ఉన్న భాగ్యశ్రీకి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. నేచురల్ స్టార్ నాని (Nani) సరసన నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ అందుకుంది. ఇటీవల ‘హిట్ 3’(Hit 3) సినిమాతో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకోగా, ప్రస్తుతం ‘దసరా’ సినిమా (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో కథానాయికగా ఎవరినీ తీసుకుంటే బావుంటుందని భావించిన మేకర్స్ భాగ్యశ్రీ బోర్సే పేరుని ఖరారు చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోలతో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ అమ్మడు ఏకంగా స్టార్ హీరో నాని సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోవటం కొస మెరుపు. ఈ సినిమా గనుక విజయం సాధిస్తే, కచ్చితంగా భాగ్యశ్రీకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభిస్తుందనటంలో సందేహం లేదు.
Also Read – Corona in usa: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్లు: పెరుగుతున్న కేసులు..!


