Saturday, November 15, 2025
HomeTop StoriesDeepika Padukone: క‌ల్కి ఓటీటీ వెర్ష‌న్‌లో దీపిక పేరు లేపేసిన‌ నిర్మాత‌లు.. ఇదేనా మీరేచ్చే గౌర‌వం...

Deepika Padukone: క‌ల్కి ఓటీటీ వెర్ష‌న్‌లో దీపిక పేరు లేపేసిన‌ నిర్మాత‌లు.. ఇదేనా మీరేచ్చే గౌర‌వం అంటూ ఫ్యాన్స్ ఫైర్‌

Deepika Padukone: దీపికా ప‌దుకొణె విష‌యంలో ఎందుక‌నో మ‌న సౌత్ మేక‌ర్స్ చాలా సీరియ‌స్‌గానే ఉన్నార‌ని జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే తెలుస్తోంది. ఎందుకంటే ఆ మ‌ధ్య ఆమె వ‌ర్కింగ్స్ అవ‌ర్స్‌పై ఆలోచించాల‌ని మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను కోర‌టంతో వారు సీరియ‌స్ అయ్యారు. ముందుగా ఈ లిస్టులో దీపికతో విబేదించింది ద‌ర్శ‌కుడు సందీప్ వంగా. ముందుగా ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్న స్పిరిట్ సినిమాలో దీపికా ప‌దుకొణెను క‌థానాయిక‌గా అనుకున్నారు. ఆమెతో క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ఆమె కూడా ముందుగా ఒప్పుకుంది. త‌ర్వాతే ఈ వ‌ర్కింగ్ అవ‌ర్స్ ఇష్యూ రావ‌టంతో పాటు ఆమె పెట్టిన కొన్ని కండీష‌న్స్ నిర్మాత‌ల‌కు ఇబ్బందిగా మారేలా ఉండ‌టంతో సందీప్ ఆమెను ప్రాజెక్ట్ నుంచి ప‌క్క‌న పెట్టేశాడు.

- Advertisement -

త‌ర్వాత ‘క‌ల్కి 2898 AD’ మూవీని నిర్మించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా దీపికా పదుకొణెను తమ అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘క‌ల్కి 2’ నుంచి తొల‌గిస్తూ అధికారికంగా ప్ర‌క‌టించింది. వీళ్లతో కూడా దీపిక ఇదే కండీష‌న్స్ వ‌ల్ల త‌ప్పుకుందా? అనేది క్లారిటీ లేదు. కానీ.. సినీ స‌ర్కిల్స్‌లో అయితే ఈ న్యూస్ వైర‌ల్ అవుతోంది. ఈ గొడ‌వ ఇక్క‌డితో ఆగ‌లేదు. క‌ల్కి నిర్మాత‌లు మ‌రో అడుగు ముందుకు వేశారు. ఇప్పుడు ‘క‌ల్కి 2898 AD’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ వెర్ష‌న్ నుంచి దీపిక పేరుని తొల‌గించ‌టం ఆంద‌రికీ షాకింగ్‌గా అనిపిస్తోంది.

Also Read – Jayasudha: పెళ్లి తర్వాత జయసుధ అందుకున్న ప్రేమలేఖలెన్నో!

దీపికా ప‌దుకొణె ఫ్యాన్స్ అయితే ఈ విష‌యంపై క‌ల్కి మేక‌ర్స్‌పై గుర్రుగా ఉన్నారు. ‘ఓ సినిమాలో టైటిల్ క్రెడిట్స్ అనేవి ఓ సినిమాలో ఆర్టిస్ట్ ప‌ని చేసేందుకు ఇచ్చే గుర్తింపు, బాధ్య‌త‌, గౌర‌వం. వాటిని ప‌క్క‌న పెట్టేసి దాన్ని కూడా ఇవ్వ‌క‌పోవ‌టం ప‌ద్ధ‌తి కాదు’ అంటూ దీపికా ప‌దుకొణె ఫ్యాన్స్ క‌ల్కి మేక‌ర్స్‌పై ఫైర్ అవుతున్నారు.

స్పిరిట్ మూవీ నుంచి ఎప్పుడైతే దీపికా ప‌దుకొణెను ప‌క్క‌కు పెట్టేశారో, వెంట‌నే ఆమె అల్లు అర్జున్‌, అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇప్పుడా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ అంద‌రూ ఓ ప‌ర్టికుల్ టైమ్‌లో ప‌ని చేస్తున్నారు. అలాగే వీకెండ్స్ లో వ‌ర్క్ చేయ‌రు. వారి గురించి ప‌ట్టించుకోని మీడియా నా విష‌యంలోనే సీరియ‌స్‌గా ప‌ట్టించుకుంటున్నారెందుకో అర్థం కావ‌టం లేదంటూ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Also Read – Rajinikanth: ఆ సినిమా తర్వాత రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad