Swara Bhaskar Controversy: ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker) ఇటీవల బై సెక్సువల్ అంటూ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీని వల్ల నెటిజన్స్, ఆడియెన్స్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా స్వర భాస్కర్ ఓ మహిళా ఎంపీపై తనకు క్రష్ ఉందని ఆమె చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై వస్తున్న ట్రోల్స్, విమర్శలకు స్వర భాస్కర్ తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై కాకుండా, దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టిపెట్టాలని ఆమె ట్రోలర్స్‌కు సూచించారు.
వివాదం ఎక్కడ మొదలైందంటే..
బై సెక్సువల్ వివాదం ఎక్కడి నుంచి మొదలైందనే వివరాల్లోకెళ్తే.. జులై నెలలో స్వర భాస్కర్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో స్వతహాగా మనుషులంతా బైసెక్సువల్స్ అని ఆమె తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఓ ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభ ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav)పై తనకు క్రష్ ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ కొన్ని రోజుల క్రితం నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తి గురించి అలా ఎలా మాట్లాడతారంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read – Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో మరో విషాదం..క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు మృతి
స్వర భాస్కర్ క్లారిటీ..
వివాదంపై స్వర భాస్కర్ సందిస్తూ.. ‘ఇంటర్వ్యూలో బైసెక్సువల్ గురించి నా అభిప్రాయం చెప్పాను. అదెందుకు వైరల్ అయిందో నాకు అర్థం కావట్లేదు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. అయినా నా ఆలోచన చెప్పానే తప్ప ప్రాక్టికల్‌గా అవుతుందని కాదు కదా. నాకు పెళ్లయింది. ఓ పాప కూడా ఉంది’ అని తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ స్పష్టత ఇచ్చారు.
ఎంపీ డింపుల్ యాదవ్‌పై తనకున్న అభిమానం గురించి స్వర భాస్కర్ మాట్లాడుతూ.. ‘డింపుల్ విషయానికొస్తే.. ఆమె అందంగా ఉంటుంది. చాలామందికి స్ఫూర్తి. ఆమె రాజకీయ నాయకుడి సతీమణి. ఆమె కూడా రాజకీయాల్లో ఉంది. డింపుల్‌ను నేనెప్పుడూ ఆరాధిస్తా. ఆ కోణంలోనే నేను మాట్లాడా’ అని క్లారిటీ ఇచ్చింది. ఈ కాంట్రవర్సీ గురించి డింపుల్‌తో మాట్లాడారా అని అడగ్గా ‘మాట్లాడలేదు… అయినా ఇదంత పెద్ద విషయం కాదు. డింపుల్, ఆమె కుటుంబ సభ్యులు పరిణతి గలవారు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని స్వర భాస్కర్ తెలియజేసింది.
దేశంలో చాలా సమస్యలున్నాయి …
‘దేశంలో ఓట్ల చోరీ లాంటి పెద్ద సమస్యలున్నాయి’ ఈ ట్రోల్స్, విమర్శలపై స్వర భాస్కర్ మరింత ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలపై దృష్టి పెట్టడం కాకుండా, దేశంలో నెలకొన్న పెద్ద సమస్యలపై దృష్టిపెట్టాలని ట్రోలర్స్‌కు ఆమె సూచించారు. ఓట్ల చోరీ లాంటి పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని.. వాటి గురించి మాట్లాడితే ఉపయోగం ఉంటుంది’ అని ఆమె నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం ‘ఛావా’ చిత్రం గురించి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె పెట్టిన పోస్టుతో అప్పుడు ఆమె X (ట్విటర్) ఖాతా కూడా సస్పెండ్ అయింది. మొత్తం మీద, స్వర భాస్కర్ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరని ఈ ఘటనలు మరోసారి రుజువు చేశాయి. తనపై వస్తున్న విమర్శలను పక్కనపెట్టి మరింత ముఖ్యమైన సామాజిక, రాజకీయ అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
Also Read – Today Weather: మేఘావృతమైన వాతావరణం.. సాయంత్రానికి చిరుజల్లులు..!


