Saturday, November 15, 2025
HomeTop StoriesNayanthara: న‌య‌నతారకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా?

Nayanthara: న‌య‌నతారకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా?

Nayanthara: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాకు కోలీవుడ్ బ్యూటీ న‌య‌న‌తార సంక్రాంతి సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా? అనే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. అందుకు కార‌ణం.. ఆమెకు సంక్రాంతి పండుగ బాగా క‌లిసి రావ‌ట‌మే. గతంలో ఆమెకు క‌లిసొచ్చిన ఈ పండుగ ఈసారి క‌లిసొచ్చేనా! అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ కాంబోలో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. ఇంత‌కు ముందు సైరా న‌ర‌సింహా రెడ్డి, గాడ్ ఫాద‌ర్ సినిమాలు వ‌చ్చాయి. సైరా న‌ర‌సింహారెడ్డిలో చిరంజీవికి జోడీగా న‌టించిన ఆమె.. గాడ్ ఫాద‌ర్‌లో చెల్లెలుగా క‌నిపించింది. ఇప్పుడు మ‌రోసారి భార్య పాత్ర‌లో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మేకింగ్‌ను గ‌మ‌నిస్తే పాజిటివ్ సెంటిమెంట్స్ అన్నీ అలా క‌లిసొచ్చేస్తున్నాయి. అందులో న‌య‌న‌తారను హీరోయిన్‌గా తీసుకోవ‌టం కూడా ఒక‌టి.

- Advertisement -

Also Read – Dragon: ఎన్టీఆర్ డ్రాగ‌న్ ఆగిపోలేద‌ట – రూమ‌ర్స్‌కు చెక్‌పెట్టిన‌ ప్ర‌శాంత్ నీల్ వైఫ్

న‌య‌న‌తార‌కు తెలుగులో సంక్రాంతి పండుగ బాగా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఆమె ట్రాక్ రికార్డును గ‌మ‌నిస్తే.. 2006లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన‌ ల‌క్ష్మీ సినిమా న‌య‌న్‌కు తొలి సంక్రాంతి సినిమా. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచింది. నాలుగేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్‌తో జోడీ క‌ట్టిన అదుర్స్ రిలీజైంది. ఆ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌రేన‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత 8 ఏళ్ల‌కు జైసింహా సినిమా కూడా సంక్రాంతి పండుగ రోజునే వ‌చ్చింది. ఆ మూవీ కూడా సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. తెలుగు స్ట్ర‌యిట్ మూవీస్‌లో సంక్రాంతికి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాలు న‌య‌న్ ఖాతాలో ఉండ‌టం విశేషం.

ఇప్పుడు న‌య‌న‌తార లేటెస్ట్ సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో నాలుగోసారి సంక్రాంతి పండుగ‌కు సంద‌డి చేయ‌నుంది. సినిమాపై ఫుల్ పాజిటివ్ బ‌జ్ ఉంది. చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత వ‌చ్చిన ఖైదీ నెంబ‌ర్ 150, వాల్తేరు వీర‌య్య సినిమాలు సంక్రాంతి పండుగ‌కే వ‌చ్చి దుమ్మురేపాయి. ఇప్పుడు మ‌రోసారి అదే సెంటిమెంట్ ‘మన శంకర వరప్రసాద్‌గారు’కు క‌లిసొస్తుందేమో చూడాలి. మ‌రో వైపు ఈ ఏడాది సంక్రాంతి పండుగ‌కు సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన వెంక‌టేష్ .. ఇప్పుడీ సినిమాలో గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి మ‌రోసారి త‌న మార్క్ చూపించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రిన్ని పాజిటివ్ సెంటిమెంట్స్ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఎలా క‌లిసొస్తాయో చూడాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

Also Read – The Raja Saab: ‘ది రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad