Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPayal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం

Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం

Actress Payal Rajput Father Passes Away: టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు. అయితే ఆయన చనిపోయిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన జులై 28న (సోమవారం) తుదిశ్వాస విడిచినట్లు పాయల్ తాజాగా తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ‘నాన్నా.. క్యాన్సర్ నుంచి మీరు కోలుకునేందుకు నేను చేయగలిగినదంతా చేశాను. కానీ విజయం సాధించలేకపోయా. క్షమించండి’ అని పాయల్ భావోద్వేగానికి గురైంది.

Also Read: https://teluguprabha.net/cinema-news/actress-kalpika-creates-another-controversy-at-moinabad-resort-in-hyderabad/

రెండు, మూడు మాత్రమే…
కాగా, పాయల్ రాజ్ పుత్ తెలుగులో ఇప్పటివరకు మొత్తం 12 సినిమాల్ల వరకు నటించింది. కానీ అందులో కేవలం రెండు, మూడు మాత్రమే విజయం సాధించాయి. యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలా అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి.. తన తొలి చిత్రంలోనే అదిరిపోయే రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఆమెకు నిరాశే ఎదురైంది. ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక ఇలా ఆమె నటించిన పలు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు.

Also Read: https://teluguprabha.net/cinema-news/actress-samantha-deadhang-challenge-video-goes-viral/

ప్రస్తుతం ఎందులో నటిస్తోందంటే
అనంతరం మంగళవారం సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. ఇక తెలుగుతో పాటు తమిళం, కన్నడ, పంజాబీలోనూ పలు చిత్రాల్లో నటించింది పాయల్ రాజ్ పుత్. కానీ అక్కడ కూడా భారీ సక్సెస్ లను ఆమె అందుకోలేకపోయింది. ప్రస్తుతం గోల్మాల్, దేవదూత, కిరాతక వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక పోతే సోషల్ మీడియాలో మాత్రం మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తోంది పాయల్. ఆ పిక్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad