Rashmika Mandanna: 2025 నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు కలిసొచ్చినట్లు మరే హీరోయిన్‌కి కూడా కలిసి రాలేదు. ఎందుకంటే ఆమె కెరీర్ స్టార్ట్ అయ్యింది మొదలు ఈ ఏడాదిలో ఆమె సినిమాలు రిలీజైనట్లు ఇంతకుముందెప్పుడూ రిలీజ్ కాలేదు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇప్పటికే మూడు సినిమాలతో సందడి చేసిన ఈ శాండిల్ వుడ్ బ్యూటీ మరో రెండు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హంగామా చేయటానికి రెడీ అయ్యింది. అది కూడా రెండు వారాల వ్యవధిలోనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఈ ముద్దుగుమ్మ చేయబోతున్న సందడిపై ట్రేడ్ వర్గాలు కూడా కన్నేశాయి. ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఆమె పెట్టుకున్న భారీ టార్గెట్ గురించి కూడా వారు ప్రస్తావిస్తుండటం విశేషం. వివరాల్లోకెళ్తే..
ఈ ఏడాది ఇప్పటి వరకు రష్మిక మందన్న మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అందులో ముందుగా ఛావా సినిమా. బాలీవుడ్ మూవీ. ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత వచ్చిన మరో బాలీవుడ్ మూవీ సికిందర్ డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత వచ్చిన కుబేర తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే తమిళ, హిందీ భాషల్లో మాత్రం ఆశించిన సక్సెస్‌ను అందుకోలేదు. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు మాత్రం రష్మికకు చాలా మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇప్పుడు ద్వితీయార్థంలో రెండు సినిమాలతో సందడి చేయనుంది. అది కూడా రెండు వారాల వ్యవధిలోనే కావటం విశేషం.
Also Read – Mamitha Baiju: ఆ మలయాళీ పిల్లకు తమిళం, తెలుగులో… గోల్డెన్ ఛాన్స్
ముందుగా ఆయుష్మాన్ ఖురానాతో రష్మిక మందన్న నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. హిందీ సినిమా అయినప్పటికీ తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఇటు రష్మిక, అటు మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు రష్మిక చేయనటువంటి పాత్రను ఇందులో చేసింది. దీని తర్వాత రెండు వాల తర్వాత ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో రానుంది. దీక్షిత్ శెట్టి ఇందులో రష్మికకు జోడీగా నటించాడు. ఈ మూవీ నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమా రష్మిక చేసిన తొలి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా.
3 ఏళ్లలో బాక్సాఫీస్ దగ్గర రష్మిక నటించిన సినిమాల కలెక్షన్స్‌ను గమనిస్తే ఇప్పటికే రూ.3వేల కోట్లు దాటాయి. ఇప్పుడు థామా, ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలను గమనిస్తే.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే వచ్చే కలెక్షన్స్‌తో ఈ రేంజ్ మరింత పెరగనుంది.
Also Read – Rishab Shetty: బాక్సాఫీస్ రిపోర్ట్: ‘ఛావా’కు చేరువవుతున్న ‘కాంతార చాప్టర్ 1’


