Rashmika Mandanna: ఇటు సౌత్, నార్త్‌తో పాటు పాన్ ఇండియా సినిమాలతోనూ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటోన్న అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒకరు. ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్‌లో మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌లో మెప్పించటానికి సిద్ధమవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను తన స్టైల్, నటనతో ఆకట్టుకుంటున్న ఈ కన్నడ బ్యూటీకి మరో బడా క్రేజీ ప్రాజెక్టులోకి బంపరాఫర్ దక్కినట్టు సినీ ఇండస్ట్రీలో సమాచారం. లేటెస్ట్ ట్రెండింగ్ సమాచారం ప్రకారం బాలీవుడ్‌కు చెందిన సూపర్ హీరో ఫ్రాంచైజీ అయిన ‘క్రిష్ 4’ (Krish 4) లో రష్మిక హీరోయిన్‌గా ఫైనల్ అయినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం క్రిష్ 4. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకు హృతిక్ రోషన్ నటించడమే కాకుండా దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. మేకర్స్ ప్రకారం ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read – Chandrababu Strategy: టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు: చంద్రబాబు వ్యూహం మళ్లీ అదేనా?
రష్మిక క్రేజ్.. తగ్గలేదు!
సినీ వర్గాల సమాచారం మేరకు ‘క్రిష్ 4’ చిత్రబృందం రష్మికతో చర్చలు జరుపుతున్నారని టాక్. ఆమె ఈ గోల్డెన్ ఛాన్స్‌కి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో రష్మిక నటించిన ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలకు ఆశించిన గుర్తింపు రాకపోయినా, ఆమె తన సత్తా నిరూపించింది. ‘పుష్ప’, ‘యానిమల్’, ‘ఛావా’ లాంటి భారీ హిట్‌లతో ఆమె పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘సికందర్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, రష్మికపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఆమె చేతిలో ‘థామా’, ‘కాక్‌టెయిల్ 2’, ‘అనిమల్ పార్క్’, ‘పుష్ప 3’, AA22-A6 వంటి పలు మెగా చిత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె ‘క్రిష్ 4’ ప్రాజెక్ట్‌లో చేరితే, పూర్తి స్థాయి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదగడం ఖాయం. ఇది రష్మిక కెరీర్‌లో మరో మెగా మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ సూపర్ హీరో చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక ‘క్రిష్ 4’లో భాగమవుతుందా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read – OG advance Bookings : ఓజీ ర్యాంపేజ్.. నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. నిమిషాల్లోనే టికెట్లు మొత్తం ఖతం


