Rashmika Mandanna: ఒకప్పుడు బయటకు కొన్ని విషయాలు మాట్లాడాలంటే హీరోయిన్స్ ఆచి తూచి స్పందించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓపెన్‌గానే విషయాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా బయాలాజికల్ సంబంధిత విషయాలపై రియాక్ట్ కావటానికి హీరోయిన్స్ ఏమాత్రం సంకోచించటం లేదు. తమకు సంబంధించిన విషయాలే కాదు.. జనరల్ ఉమెన్‌కు సంబంధించిన విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న కూడా ఇలాంటి కామెంట్స్ చేయటంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏ విషయంపై ఓపెన్‌గా మాట్లాడిందో తెలుసా!.. పీరియడ్స్‌కు సంబంధించిన మేటర్.
అసలు విషయంలోకి వెళితే.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో రష్మిక మందన్న ఫుల్ బిజీగా ఉంది. అందులో భాగంగా ఆమె జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌తో కలిసి పార్టిసిపేట్ చేసింది. సీనియర్ టాలీవుడ్ స్టార్ జగపతి బాబు హోస్ట్ చేస్తోన్న ఈ షో పాల్గొన్న రష్మిక మందన్నను ‘నువ్వు మగాళ్లకు కూడా పీరియడ్స్ రావాలనుకున్నావు కదా’ అని అంటే అవునన్నట్లు తల ఊపిన ఈ కన్నడ బ్యూటీ దానికి స్పందిస్తూ ‘మగాళ్లకు కనీసం ఒకసారైనా పీరియడ్స్ వస్తే బావుంటుంది. ఆ సమయంలో మహిళలు పడే బాధ వారికి అర్థమవుతుంది’ అని చెప్పింది. దీంతో జగపతి బాబుతో పాటు అక్కడున్న ఆడియెన్స్ అందరూ క్లాప్స్ కొట్టారు.
Also Read – Rahul: తాళిపై రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు వైరల్!
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా విషయానికి వస్తే.. నవంబర్ 7న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. నవంబర్ 14న తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి సినిమాను నిర్మించారు. రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటించాడు.
ఈ ఏడాది రష్మిక నంటించిన ఐదో సినిమా ఇది. ఇప్పటికే 2025లో ఛావా, సికిందర్, కుబేర, థామా చిత్రాలతో ప్రేక్షకులను ఈ ముద్దుగుమ్మ పలకరించింది. సికిందర్ మినహా మిగిలిన సినిమాలన్నీ మంచి విజయాలనే దక్కించుకున్నాయి. మరి తొలిసారి రష్మిక మందన్న నటించిన ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి మరి. సినిమాపై మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే నెక్ట్స్ ఆమె చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసాపై అంచనాలు మరింత పెరుగుతాయనటంలో సందేహం లేదు. మైసా షూటింగ్ కేరళ అడవుల్లో జరుగుతోంది.
Also Read – Sudheer Babu: గర్ల్‌ఫ్రెండ్ డైరెక్టర్‌తో సుధీర్‌బాబు మూవీ ఫిక్స్ – అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?


