AA22- Rashmika: వైవిధ్యమైన సినిమాలతో ఇటు సౌత్, అటు నార్త్ ఇండియన్ ప్రేక్షకులను మెప్పిస్తోన్న హీరోయిన్స్‌లో రష్మిక మందన్న ఒకరు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో వరుస అవకాశాలను అందుకుంటోంది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న లేటెస్ట్ సమాచారం మేరకు.. ఇప్పుడు AA22లో నేషనల్ క్రష్ నటించనుందని సమాచారం. పుష్ప2 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ జోడి ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రంలో దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీతో పాటు మరో ముగ్గురు క్రేజీ బ్యూటీస్ కూడా ఈ చిత్రంలో నటించనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ఒక పాత్రలో రష్మిక మందన్న కనిపించనుందని.. అది కూడా నెగెటివ్ టచ్ ఉన్న రోల్ కావటం విశేషం.
ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న రష్మిక మందన్న ఇప్పుడు నెగెటివ్ రోల్‌లో నటించనుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీపికా పదుకొనెతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌లు AA22లో కనిపించనుండటం డిస్కషన్ పాయింట్‌గా మారింది. మరి జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌లు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారనే దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. పుష్ప2తో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాను అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవల ముంబైలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మూడు నెలల పాటు అక్కడే వేసిన స్పెషల్ సెట్‌లో AA22 షూటింగ్‌ను చేయనున్నారు.
Also Read – తెలుగుప్రభలో నేటి కార్టూన్ కహాని 11-07-2025
AA22 షూటింగ్‌ను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకున్నాడు అట్లీ. అనుకున్నట్లే పక్కా ప్లానింగ్‌తో సినిమాలను పూర్తి చేయటంలో అట్లీ దిట్ట. ఓవైపు షూటింగ్‌ను పూర్తి చేస్తూనే మరో వైపు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మీద కూడా ఫోకస్ చేస్తాడు డైరెక్టర్. మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు AA22 కోసం హాలీవుడ్ యాక్టర్స్‌ను మెయిన్ విలన్ రోల్ కోసం తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లిస్టులో విల్ స్మిత్, డ్వెన్ జాన్సన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు హాలీవుడ్‌లో నెంబర్ వన్ స్టార్ విల్ స్మిత్ కాగా, మరొకరు ‘ది రాక్’ గా పేరొందిన డ్వెన్ జాన్సన్. అయితే వీరిద్దరినీ ఓ ఇండియన్ సినిమాలోకి తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
AA22 మేకింగ్ కోసం మేకర్స్ కాంప్రమైజ్ కావాలనుకోవటం లేదు. అందుకోసం భారీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం పలు అంతర్జాతీయ కంపెనీలు పని చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు ఒత్తిడి తెచ్చుకోకుండా కంటెంట్‌ను త్వరగా సిద్ధం చేసేలా ముందు నుంచే ప్లానింగ్‌తో ముందుకెళుతున్నారని సమాచారం.
Also Read – Telangana BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. కేబినెట్ ఆమోదం..!


