Saturday, November 15, 2025
HomeTop StoriesRashmika Diet Plan: సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన రష్మిక మందన్న..

Rashmika Diet Plan: సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన రష్మిక మందన్న..

Rashmika Diet Plan: ఇటీవలి రోజుల్లో అత్యంత విజయవంతమైన హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు ముందుగా వినిపిస్తోంది. ఈ అందాల తార దక్షిణాదో, ఉత్తరాదో అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస హిట్లతో ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. విజయాలతో పాటు మంచి నటి అన్న గుర్తింపు కూడా తెచ్చుకోవడానికి రష్మిక తీరిక లేకుండా కష్టపడుతోంది. అసలు ఆమె సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటనేది రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ రివీల్ చేసింది. ఇంతకీ రష్మిక మందన్న సక్సెస్ సీక్రెట్ ఏంటి? కన్నడ బ్యూటీ చెప్పిన రహస్యమేంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం..

- Advertisement -

రష్మిక మందన్న సినిమాల జోరు పెరుగుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం, అలవాట్లు, ఫిట్‌నెస్ రహస్యాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో ఎక్కువవుతోంది. ఇప్పటివరకు ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె గత చిత్రాలను గమనిస్తే పుష్ప 2లో పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లిగా, యానిమల్‌లో నేటి తరం అమ్మాయి పాత్రలో, చావా వంటి పీరియాడిక్ మూవీలో నిజ జీవిత పాత్రలో అలరించింది. కుబేర విషయానికి వస్తే ప్రేమలో మోసపోయిన అమాయకురాలిగా మెప్పించింది. ఈ విధంగా ప్రతి సినిమాలో ఒక పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానం సంపాదించుకుంటున్నారు.

Also Read- Viral Video: చీకులు కొనడానికి వచ్చిన భయంకరమైన కింగ్ కోబ్రా.. ఇదిగో వీడియో!

సౌత్, నార్త్ అనే భేదం లేకుండా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తూ, బిజీ షెడ్యూల్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన్న తన టైమ్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. బ్యాక్‌టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో పాల్గొంటున్నప్పటికీ, ఒక్క పనిలో కూడా తడబడకుండా, ఎక్కడా గ్యాప్ రాకుండా సమయాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నారు. ఈ అత్యంత కఠినమైన షెడ్యూల్స్ మధ్య శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేందుకు, ముఖ్యంగా ఆరోగ్యంపై అపారమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. తన డైట్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తూ, బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ అందేలా బలమైన, బేలెన్స్‌డ్ డైట్‌ను అనుసరిస్తున్నారు. షూటింగ్స్, ట్రావెల్, ప్రమోషన్స్ మధ్యలోనూ తినే ఆహారానికి తగిన ప్రాధాన్యం ఇస్తూ, ఫిట్‌నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు.

నేషనల్ క్రష్ ఉదయం ఒక లీటర్ నీటితో తన రోజును స్టార్ట్ చేస్తోంది. హైడ్రేషన్ అనేది హెల్తీ లైఫ్‌స్టైల్‌కి ఫస్ట్ స్టెప్ అన్న ఫాలోఫీపై ఆమె నమ్మకం పెట్టుకుంది. ఇక డైట్ విషయంలో అయితే… చీప్ మిల్స్‌కి, క్రేవింగ్స్‌కి గుడ్‌బై చెప్పేసి, ఫుల్లీ డైటీషియన్ ప్లాన్ చేసిన మీల్స్‌కే కట్టుబడి ఉంది. తన ఆహారపు అలవాట్లలో చేసిన మెయిన్ ఛేంజ్ ఏంటంటే.. నాన్ వెజిటేరియన్ ఫుడ్‌కు గుడ్‌బై చెప్పేసిందట. అవును.. రష్మిక ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నారు. ఫిట్‌నెస్, ఫోకస్, ఫ్రెష్‌నెస్ — ఇవన్నీ మెయింటేన్ చేయాలంటే, తినే ఆహారం ఎంత కీలకమో ఆమెకు బాగా తెలుసు. అందుకే రోజువారీ షెడ్యూల్‌లోనూ డైట్ విషయంలో కాంప్రమైజ్‌ ఎప్పుడూ ఉండదట.

Also Read- OG Ticket Rates : గుడ్ న్యూస్ చెప్పేసిన తెలంగాణ ప్రభుత్వం..OG పూన‌కాలు లోడింగ్‌

కేవలం హెల్దీ ఫుడ్ ఎంచుకోవడమే కాదు… డెడికేటెడ్ వర్కౌట్ రొటీన్‌తో కూడిన లైఫ్‌స్టైల్‌నే ఫాలో అవుతున్నారు ఈ నేషనల్ క్రష్. “షూటింగ్ టైమింగ్స్ ఎంత బిజీగా ఉన్నా, రోజూ సాయంత్రం ఓ గంట వర్కౌట్ చేయకపోతే నా డే కంప్లీట్ అయినట్లే ఉండదు” అంటోంది రష్మిక. ఈ మాటల్లో ఆమె డెడికేషన్, డిసిప్లిన్ క్లియర్‌గా కనిపిస్తోంది. వర్కౌట్స్ విషయంలోనూ.. యోగా, కార్డియో, వెయిట్ ట్రైనింగ్, పిలేట్స్ ఇలా వివిధ రకాల ఫిట్‌నెస్ రొటీన్లతో బాడీని టోన్ చేయడమే కాదు, మైండ్‌కీ రిఫ్రెష్‌మెంట్ అందుకుంటోంది. డైట్, వర్కౌట్స్ మీద ఈంత కంట్రోల్ ఉంచుతూ, ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు వ్యక్తిగత ఫిట్‌నెస్ జర్నీని బ్యాలెన్స్ చేస్తూ… రష్మిక తన కెరీర్‌లో కొత్త మైలురాళ్లను సాధిస్తూ ముందుకు సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad