Actress Samantha Deadhang Challenge Video: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఫిట్‌నెస్ పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటారు. 90 సెకన్ల పాటు డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదే ముఖ్యం..
సమంత.. ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన విషయమే. టేక్20హెల్త్ అనే పాడ్‌కాస్ట్ లో ఆమె ఎప్పటికప్పుడు తన ఆరోగ్య రహస్యాలను, ఫిట్‌నెస్ సూత్రాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఆమె జిమ్‌లో 100 కిలోలు ఎత్తిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆమెను చూసి ఫాలోవర్స్ కూడా ఎంతో స్ఫూర్తి పొందుతుంటారు. అయితే తాజాగా ఓ ట్రైనర్, సమంత స్వీకరించిన డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్ వీడియోను పంచుకున్నారు. “మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది విషయం కాదు. మీ వారసత్వం ఏమిటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు పంచుకోవడం కూడా ప్రాధాన్యం కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేది ముఖ్యం” అని సదరు ట్రైనర్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సమంత డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు. ఆమె ఫిట్‌నెస్ పట్ల చూపే శ్రద్ద ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. సామ్ సో స్ట్రాంగ్ అని కూడా అంటున్నారు. ఇక సమంత ఈ ఛాలెంజ్‌తో తన శారీరక, మానసిక సామర్ద్యాన్ని మరోసారి ప్రదర్శించినట్టైంది.
ఇప్పుడు నిర్మాతగానూ..
సినిమాల విషయానికి వస్తే.. సమంత సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. ఇటీవలే నిర్మాతగా మారి ‘శుభం’ సినిమాలో చిన్న క్యామియో రోల్ చేసింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే రెండో ప్రొడక్షన్‌తో రాబోతుంది. ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే ప్రస్తుతం బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి ‘రాణీ’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.
View this post on Instagram


