Sangeetha: గత కొన్నాళ్లుగా పెళ్లిళ్ల కంటే విడాకులతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోన్నారు సినిమా సెలిబ్రిటీలు. సడెన్‌గా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తున్నారు. నాగచైతన్య – సమంతతో పాటు ధనుష్, ఏఆర్ రెహమాన్, జయం రవి, ఆమిర్‌ఖాన్.. ఇలా గత కొన్నేళ్లలో చాలా మంది స్టార్స్ విడాకుల బాట పట్టారు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా భర్త నుంచి విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.
సింగర్ క్రిష్‌తో పెళ్లి…
తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది సంగీత. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తోంది. 2009లో తమిళ సింగర్ క్రిష్‌ను పెళ్లిచేసుకున్నది సంగీత. సింగర్‌గానే కాకుండా యాక్టర్‌గా కూడా కొన్ని సినిమాలు చేశాడు క్రిష్. పెళ్లి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు పక్కన భర్త పేరును జత చేసి సంగీత క్రిష్ పేరుతో అకౌంట్‌ను కొనసాగిస్తూ వచ్చింది సంగీత. ఇటీవల సడెన్‌గా భర్త క్రిష్ పేరును తొలగిస్తూ సంగీత యాక్టర్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ బయోలో సంగీత మార్పులు చేసింది. సంగీత శాంతారం అంటూ బయోలో తండ్రి పేరును యాడ్ చేసింది. దాంతో సంగీత విడాకుల వార్త తెరపైకి వచ్చింది. క్రిష్, సంగీత విడిపోనున్నారంటూ ప్రచారం మొదలైంది.
Also Read – War 2 : ట్విట్టర్ వేదికగా హృతిక్-ఎన్టీఆర్ మాటల సవాళ్లు.. యుద్ధానికి సిద్ధమంటూ!
గెట్ టూ గెదర్‌లో…
ఇటీవల 1990 స్టార్స్ గెట్ టూ గెదర్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకల్లో సంగీత ఒంటరిగానే పాల్గొన్నది. క్రిష్ కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలైనట్లు కోలీవుడ్‌లో పుకార్లు మొదలయ్యాయి. ఈ విడాకుల వార్తలపై సంగీత రియాక్ట్ అయ్యింది. క్రిష్, తాను విడిపోనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఈ పుకార్లు ఎలా మొదలయ్యాయో కూడా తనకు తెలియదని అన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను మొదటి నుంచి సంగీత యాక్టర్ పేరుతోనే అకౌంట్‌ను కొనసాగిస్తున్నానని చెప్పింది. ఇది తప్ప తనకు వేరే అకౌంట్స్ ఏం లేవని చెబుతూ విడాకుల వార్తలకు పుల్‌స్టాప్ పెట్టింది సంగీతం.
ఖడ్గం మూవీతో బ్రేక్…
ఖడ్గం సినిమాతో తెలుగులో ఫస్ట్ బ్రేక్‌ను అందుకుంది సంగీత. సినిమాల పట్ల పిచ్చి ఉన్న యువతిగా ఈ మూవీలో కనిపించింది. పెళ్లాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, సంక్రాంతి వంటి సినిమాలతో హీరోయిన్‌గా తె లుగులో విజయాలను అందుకున్నది. తమిళంలో పితామగన్ మూవీలో ఢీ గ్లామర్ రోల్‌లో మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మసూద మూవీలో ఆత్మ బారి నుంచి తన కూతురిని కాపాడుకునే పాత్రలో చక్కటి నటనను కనబరిచింది సంగీత. దళపతి విజయ్ వారిసులో శ్రీకాంత్ భార్యగా కనిపించింది.
Also Read – Tamanna: హీరోయిన్ ని తీసేయండి అన్న స్టార్ హీరోనే..క్షమాపణలు చెప్పాడు!


