Coolie: కమల్ హాసన్ ముద్దుల తనయ, విలక్షణ నటి శ్రుతీ హాసన్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటోంది. మరో వైపు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇంత యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. ఇకపై తాను సోషల్ మీడియాలోనూ కొన్నాళ్ల పాటు అందుబాటులో ఉండనని.
తాజాగా ఆమె కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు శ్రుతీ హాసన్ (Shruti Haasan)ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది. “నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను” అంటూ శ్రుతీ హాసన్ షేర్ చేసిన ఈ మెసేజ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.శ్రుతి హాసన్ రజనీకాంత్‌గారితో కలిసి ‘కూలీ’ సినిమాలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) అదరగొట్టే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకాంత్ (Rajinikanth)టైటిల్ పాత్రలో నటిస్తుంటే ఆమిర్ ఖాన్ (Aamir Khan), నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర, సత్యరాజ్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు శ్రుతి కూడా నటిస్తుండటం అనేది నటిగా ఆమెకు ఎంతో ఉపయోగడుతుందనటంలో సందేహం లేదు.
Also Read – HHVM: హరిహర వీరమల్లు విషయంలో ఫీలవుతోన్న నిర్మాత ఎ.ఎం.రత్నం
కూలీ మూవీ విషయానికి వస్తే మోస్ట్ అవెయిటింగ్ మూవీగా కూలీ ఆగస్ట్ 14న రిలీజ్ (Coolie Release date) కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ సంస్థ రిలీజ్ చేస్తోంది. తమిళ సినిమా తెలుగు అనువాదం హక్కుల విషయంలో కూలీ సెన్సేషన్ క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. తెలుగు హక్కులను రూ.52 కోట్లకు (Coolie Thetrical Rights) మన నిర్మాతలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాలి. సినిమాపై ఉన్న అంచనాలను చూస్తుంటే సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను క్రాస్ అవుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
Also Read – CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ.. షరతులు వర్తిస్తాయి


