Actress Sreeleela: శ్రీలీల కెరీర్‌లో సక్సెస్‌ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ డిజాస్టర్స్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లను అందుకుంటోంది. తెలుగులో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతున్న శ్రీలీల ఈ ఏడాది కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
జూనియర్ మూవీ….
కాగా శ్రీలీల హీరోయిన్‌గా నటించిన కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీ జూనియర్ (Junior Movie) జూలై 18న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటీ ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ధమాకా (Dhamaka) సక్సెస్ టైమ్‌లో శ్రీలీల జూనియర్ సినిమాను అంగీకరించింది. ఎన్నో అడ్డంకులను దాటుకొని దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read – Electricity Bill: రూ.15 లక్షల బిల్లు.. మాస్టర్‌కు కరెంట్ షాక్ కొట్టింది
పది కోట్ల రెమ్యూనరేషన్..
జూనియర్ సినిమా కోసం శ్రీలీల గట్టిగానే రెమ్యూనరేషన్ (Sreeleela Remunaration) అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది శ్రీలీల. జూనియర్‌కు మాత్రం పది కోట్ల వరకు శ్రీలీల డిమాండ్ చేసినట్లు చెబుతోన్నారు. తెలుగుతో పాటు కన్నడంలో శ్రీలీలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె కోరినంత మొత్తాన్ని మేకర్స్ అందజేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న యాక్టర్ కూడా శ్రీలీలనేనని కన్నడ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీలీలనే కారణం…
జూనియర్ సినిమాకు తెలుగులో అంతో ఇంతో హైప్ రావడానికి శ్రీలీలనే మెయిన్ రీజన్. శ్రీలీలకు ఉన్న గ్లామర్ ఇమేజ్ కన్నడంలో ఈ సినిమాకు హెల్పయ్యే అవకాశం ఉండటంతో శ్రీలీలకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను మేకర్స్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. జూనియర్ మూవీలో బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా (Genelia) ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. లాంగ్ గ్యాప్ ఆ తర్వాత ఈ బైలింగ్వల్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది జెనీలియా. నెగెటివ్ కనిపించే పాజిటివ్ క్యారెక్టర్‌లో ఈ సీనియర్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు సమాచారం. జూనియర్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా…బాహుబలి ఫేమ్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Also Read – Parijat Plant: పారిజాత మొక్కను ఈ దిశలో నాటితే.. ఆరోగ్యంతోపాటు అంతులేని ఐశ్వర్యం!
ఉస్తాద్ భగత్ సింగ్…
ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో (Ustaad Bhagat Singh) పాటు రవితేజ మాస్ జాతర సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తితో కోలీవుడ్‌లోకి తొలి అడుగు వేయబోతుంది. బాలీవుడ్‌లో ఆషికీ 3 సినిమా చేస్తుంది. ఆషికీ 3 హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్‌లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరు పెళ్లిచేసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.


