Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSreeleela Record: శ్రీలీల రికార్డ్‌.. మ‌రో హీరోయిన్‌కి ఇప్ప‌ట్లో సాధ్యం కాదేమో!

Sreeleela Record: శ్రీలీల రికార్డ్‌.. మ‌రో హీరోయిన్‌కి ఇప్ప‌ట్లో సాధ్యం కాదేమో!

Sreeleela Latest Movies: కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన క్యూటీ హీరోయిన్ శ్రీలీల, తొలిసారి 2019లో ‘కిస్’ అనే మూవీతో స్క్రీన్‌పై కనిపించింది. అయితే తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం 2021లో వచ్చిన ‘పెళ్లి సందడి’తో. ఈ సినిమా బాగా ఆడకపోవడంతో ఆమెను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ‘వన్ మూవీ వండర్’గానే మిగిలిపోతుందేమో అనుకున్నారు చాలామంది.

- Advertisement -

ధమాకా ఇచ్చిన బ్రేక్..!
అయితే శ్రీలీల లైఫ్‌ని మార్చింది రవితేజతో చేసిన ‘ధమాకా’. అప్పటికి రవితేజ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌లో ఉండగా, ఈ కాంబినేషన్ మీద పెద్దగా ఎవ్వరూ ఆశలు పెట్టుకోలేదు. కానీ సినిమా మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుని హిట్ కొట్టింది. ముఖ్యంగా శ్రీలీల గ్లామర్, ఎనర్జిటిక్ డాన్స్‌లు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసినవాళ్లందరికీ ‘ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది’ అనే ఫీలింగ్ వచ్చేసింది. ధమాకా హిట్ కావడంతో, శ్రీలీలకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఒకే ఏడాదిలో 10కు పైగా సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇది నెమ్మదిగా ఎవరైనా చేరే స్టేజ్, కానీ శ్రీలీల మాత్రం బుల్లెట్ స్పీడ్‌లో దాన్ని క్రాస్ చేయటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Also Read- Tollywood and Kollywood: త‌మిళ హీరోలు – తెలుగు డైరెక్ట‌ర్లు – వెరైటీ కాంబినేష‌న్స్‌లో వస్తోన్న టాలీవుడ్ మూవీస్ ఇవే!

పాన్ ఇండియా రేంజ్!.. నాలుగు భాషలు
2024లో వచ్చిన ‘పుష్ప 2’తో. సినిమాలో కేవలం ఒక ఐటెం సాంగ్ ‘కిస్సిక్’ చేసినా, ఆ పాట ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చింది. హిందీలో సాంగ్‌ బ్లాక్‌బస్టర్ అయ్యింది. బాలీవుడ్‌ ఆడియన్స్ కూడా ‘ఈ హీరోయిన్ ఎవరా’ అంటూ గూగుల్‌లో సెర్చ్ చేసినంతగా ఫేమ్ వచ్చింది. అదే రీతిలో, హిందీ ఫిలింమేకర్లు కూడా శ్రీలీలను నోటిస్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో శ్రీలీలకు అన్ని భాషల నుంచి అవకాశాలు వెల్లువలా రావటం ప్రారంభమయ్యాయి. ఈ పీక్ టైమ్‌లో శ్రీలీల ఒకటి కాదు.. ఏకంగా నాలుగు భాషల్లో సినిమాలు చేయటం ఓ రికార్డ్ అని సినీ వర్గాలంటున్నాయి. రీసెంట్‌గా విడుదలైన కన్నడ మూవీ ‘జూనియర్’తో పాటు ఆగస్ట్‌లో రవితేజతో నటించిన ‘మాస్ జాతర’ రిలీజ్ కానుంది. తమిళంలో సుధా కొంగర తెరకెక్కిస్తోన్న ‘పరాశక్తి’లో నటిస్తుంది. ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి ఏకంగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అందులో ఒకటి ‘ఆషికి 3’ సెట్స్‌పై ఉంది. ఇక రెండో సినిమా రణవీర్ సింగ్‌తో అని మూవీ సర్కిల్స్ టాక్. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే హిందీ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతోందట. రీసెంట్‌గానే లుక్ టెస్ట్ కూడా పూర్తయ్యిందని సమాచారం.

Also Read- Ye Maaya Chesave: బాక్సాఫీస్ వ‌ద్ద నాగ‌చైత‌న్య‌, స‌మంత మూవీ కుమ్మేసిందిగా – ఏ మాయ చేశావే రీ రిలీజ్ క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

సినీ ఇండస్ట్రీలో కొన్ని ఛాన్స్‌లు, కొన్ని టైమింగ్‌లు యాక్టర్స్‌ని ఊహించని లెవెల్‌కి తీసుకెళ్తాయి. శ్రీలీల విషయంలో ఇదే జరిగింది. మొదట్లో చిన్న సినిమాలు చేసినా, ఆ తర్వాత వచ్చిన అవకాశాలను వదలకుండా, దూసుకెళ్లోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad