Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభUrmila Kothare: నటి కారు ఢీకొని కార్మికుడు మృతి

Urmila Kothare: నటి కారు ఢీకొని కార్మికుడు మృతి

ముంబైలో మరాఠీ నటి ఉర్మిళా కొఠారే (Urmila Kothare) కారు ఢీకొని ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన కాండీవిల్లీలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఉర్మిళా షూటింగ్‌ నుంచి తన కారులో ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో మెట్రో ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపై వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

కారును అత్యంత వేగంగా నడపడమే ఈ ప్రమాదం జరిగేందుకు కారణమని తెలుస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో కారులోని వారికి పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా నటి కూడా స్వల్పంగా గాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News