Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభAdipurush: 'ఆదిపురుష్' న్యూ రిలీజ్ డేట్ ఇదే

Adipurush: ‘ఆదిపురుష్’ న్యూ రిలీజ్ డేట్ ఇదే

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న ఆదిపురుష్ గురించి బోలెడన్ని గాసిప్స్ వస్తూనే ఉన్నాయి కదా.  లేటెస్ట్ గా జూన్ 16న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టు టీం అఫిషియల్ గా వెల్లడించింది.

- Advertisement -

ఓం రౌత్ దర్శకత్వంలో అత్యద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని ఆవిష్కరిస్తున్నట్టు చిత్ర బృందం తెగ ప్రచారం చేసేసుకుంటూంటే మరోవైపు.. అసలు ఇది కార్టూన్ కంటే ఘోరంగా ఉందనే మీమ్స్, కామెంట్స్ తారాస్థాయికి చేరుకుంటున్నాయి.  2022 ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఫస్ట్ లుక్, గ్లమ్స్, టీజర్, ప్రోమో చూసి అందరూ బెదిరిపోయి..ఒకటే నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వటంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసి రీ వర్క్ చేశారు. అలా జనవరి 2023కి రిలీజ్ కావాల్సి ఉన్నా కాలేదు.  చివరికి మళ్లీ లేటెస్ట్ డేట్ ను లాక్ చేసింది ఆదిపురుష్ బృందం.

ఇక పఠాన్ మొదలు ఈమధ్య సినిమా ప్రమోషన్ కు ముందు వైష్ణోదేవి దర్శనం చేసుకోవటం బాలీవుడ్ లో  సెంటిమెంట్ గా మారటంతో ఈ సినిమా టీం కూడా ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నేతృత్వంలో వైష్ణోదేవి యాత్ర పూర్తి చేశారు. ఇక్కడి నుంచే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

రామాయణం ఆధారంగా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా గ్రాఫిక్స్ సినిమాగా ఉంటుందని అంచనాలున్నాయి. ప్రభాస్ రాజు రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News