Salaar : ప్రభాస్ చేతిలో భారీ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. భారీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు కానీ ఒక్క సినిమా నుంచి కూడా అప్డేట్స్ మాత్రం రావట్లేదు. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ టీజర్ అందరి అంచనాల్ని తలకిందులు చేసింది. ప్రభాస్ ప్లానింగ్ నే మార్చేసింది. ఈ టీజర్ ని చూసి సినిమాపై విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సంక్రాంతి బరిలోకి వద్దామనుకున్న ఆదిపురుష్ టీజర్ విపరీతంగా నెగెటివిటీ ఫేస్ చెయ్యడంతో జనవరి నుంచి జూన్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసి మరో 100కోట్లు బడ్జెట్ తో మళ్ళీ వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారు.
ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల తర్వాత ఆదిపురుష్ వస్తుండటంతో సినిమాపై క్రేజ్ చాలా ఉండేది. కానీ టీజర్ చూసిన తర్వాత మొత్తం పోయింది. దీంతో ప్రభాస్ కి ఇప్పుడు ఒక మంచి సాలిడ్ హిట్ కావాలి. అందుకే ఆదిపురుష్ సినిమాని మరింత వెనక్కి తోసేసి సలార్ ని ముందుకి తీసుకురావాలని ప్రభాస్ అనుకుంటున్నాడు. సలార్ సినిమా కూడా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడి 2023 సెప్టెంబర్ లో వస్తుంది అని చెప్పారు. అయితే మరింత ఫాస్ట్ గా షూట్ కంప్లీట్ చేసి ఇంకొంచెం ముందే ఈ సినిమాని తీసుకురావాలని, ఆదిపురుష్ సినిమాని 2024కి వాయిదా వేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట.
అభిమానులు కూడా ఆదిపురుష్ సినిమాపై అంచనాలు వదిలేసుకోవడంతో ప్రస్తుతం ప్రభాస్ భవిష్యత్తు సలార్ సినిమా మీదే ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ ప్రభాస్ కి మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇస్తుందని నమ్ముతున్నారు. మరి ఇది జరిగే పనేనా చూడాలి. నిజంగానే ఆదిపురుష్ సినిమా మీద నెగిటివ్ తగ్గడానికి, ప్రభాస్ కి హిట్ వచ్చి మళ్ళీ మార్కెట్ లో నిలబడటానికి సలార్ సినిమా ముందు రావాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఏమవుతుందో చూడాలి మరి.