Adivi Sesh Movie: అడివి శేష్ హీరోగా నటించిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ థియేటర్లలో రిలీజైన పదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
అంథాలజీగా తెరకెక్కిన ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు చైతన్యకృష్ణ, కమల్ కామరాజు, మహత్ రాఘవేంద్ర హీరోలుగా నటించారు. నిఖితా నారాయణన్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ బాసిన్ హీరోయిన్లుగా కనిపించారు. పీబీ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంజీవ్‌రెడ్డి కథను అందించారు. బాలీవుడ్ మూవీ లాగిన్‌కు రీమేక్‌గా లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ మూవీ రూపొందింది. 2015లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా సరైన విజయాన్ని సాధించలేకపోయింది.
Also Read- AA22 Update: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ – అల్లు అర్జున్, అట్లీ మూవీ రిలీజ్ అప్పుడేనట!
కెరీర్ ఆరంభంలో…
కెరీర్ ఆరంభంలో హీరోగా నిలదొక్కుకుంటున్న టైమ్‌లో అడివి శేష్ చేసిన సినిమాల్లో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ఒకటి. ఈ సినిమాకు రఘు కుంచే మ్యూజిక్ అందించాడు. తెలుగులో ఫస్ట్ సైబర్ క్రైమ్ కామెడీ మూవీగా లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
స్టైలిష్ క్యారెక్టర్‌లో…
ఇంటర్‌నెట్, సోషల్ మీడియా వల్ల మూడు జంటలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్‌తో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ మూవీ రూపొందింది. ఈ మూవీలో స్టైలిష్ క్యారెక్టర్‌లో అడివి శేష్ కనిపించారు. ఈ సినిమా రన్‌టైమ్ కూడా రెండు గంటలే కావడం గమనార్హం.
Also Read- Anushka Shetty: విలన్ పాత్రలపై మనసుపడ్డ అనుష్క – నాలోని ఆ యాంగిల్ చూపించాలనుందంటూ కామెంట్స్
డెకాయిట్…గూఢచారి 2
ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నాడు అడివిశేష్. గూఢచారి 2తో పాటు డెకాయిట్ సినిమాలు చేస్తున్నాడు లవ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డెకాయిట్ మూవీకు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి 2 వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. డెకాయిట్‌తో పాటు గూఢచారి 2 సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లేను అడివి శేష్ అందిస్తున్నారు.


