Tollywood Young Heroes: గతంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోలు రెండు, మూడేళ్లకు ఓ సినిమా చేసేవారు. యంగ్ హీరోలు మాత్రం ఏడాదికి కనీసం రెండు సినిమాలతోనైనా ప్రేక్షకులను పలకరించేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్‌గా కనిపిస్తోంది. ఒక్కో స్టార్ హీరో చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. కానీ యంగ్ హీరోలు మాత్రం ఒక్కో సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు టైమ్ కేటాయిస్తున్నారు. సినిమాల కోసం చాలా గ్యాప్ తీసుకుంటున్నారు.
2022 తర్వాత…
అడివి శేష్ సినిమా రిలీజై మూడేళ్లు దాటిపోయింది. చివరగా 2022లో రిలీజైన హిట్ 2తో హీరోగా ప్రేక్షకులను పలకరించారు. అప్పటి నుంచి కేవలం షూటింగ్‌లకే పరిమితమయ్యారు అడివి శేష్. ప్రస్తుతం డెకాయిట్‌తో పాటు గూఢచారి 2 సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. ఈ సినిమాల షూటింగ్‌ల కోసమే రెండేళ్లు కేటాయించాడు. డెకాయిట్ ఈ డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుండగా…గూఢచారి 2 వచ్చే ఏడాది మేలో థియేటర్లలోకి రాబోతుంది.
Also Read- Kotha Lokah Chapter 1: ‘కొత్త లోక చాప్టర్ 1’ సెన్సేషన్.. 13 రోజుల్లోనే మరో అరుదైన రికార్డ్ సొంతం!
మెగా మేనల్లుళ్లు నో మూవీస్…
మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లు అవుతోంది. 2023లో రిలీజైన బ్రో తర్వాత సాయిధరమ్‌తేజ్ సినిమా ఏది రిలీజ్ కాలేదు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సినిమాలకు రెండేళ్లు గ్యాప్ ఇచ్చాడు. ప్రజెంట్ సంబరాల ఏటిగట్టుతో బిజీగా ఉన్నాడు. దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా సంబరాల ఏటిగట్టు తెరకెక్కుతోంది. రోహిత్ కేపీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవ్‌తేజ్‌ది అదే పరిస్థితి. ఆదికేశవ రిలీజై రెండేళ్లు దాటినా వైష్ణవ్‌తేజ్ నెక్స్ట్ సినిమా ఏదన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు.
మూడు సినిమాలు ఉన్నా..
2025లో శర్వానంద్ సినిమా రిలీజ్ కావడం అనుమానంగానే ఉంది. మనమే తర్వాత మూడు సినిమాలు అంగీకరించాడు శర్వానంద్. మనమే రిలీజై ఏడాది అవుతోన్న ఈ మూడు సినిమాల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. నారి నారి నడుమ మురారి సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంపత్ నందితో చేస్తున్న భోగితో పాటు యూవీ క్రియేషన్స్ మూవీ షూటింగ్‌లు సగం కూడా కంప్లీట్ కాలేదు.
రెండేళ్లు గ్యాప్…
ఏజెంట్ డిజాస్టర్‌తో అఖిల్ కెరీర్ డైలమాలో పడింది. దాంతో నెక్స్ట్ మూవీ విషయంలో రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. చాలా కథలు విన్న అఖిల్, లెనిన్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీకి మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది లెనిన్ రిలీజ్ కాబోతుంది. నిఖిల్ సినిమా థియేటర్లలోకి వచ్చేది 2026లోనే. అతడి కెరీర్‌కు ఏడాదిన్నరపైనే గ్యాప్ వచ్చింది. వచ్చే ఏడాది స్వయంభూతో నిఖిల్ సందడి చేయబోతున్నాడు.


