Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్… అభిషేక్ బచ్చన్ ఒకరి తర్వాత మరొకరు హైకోర్టును ఆశ్రయించడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును దుర్వినియోగం చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలంటూ మంగళవారం ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. ఏఐ ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారంటూ తన పిటిషన్‌లో ఐశ్వర్యరాయ్ పేర్కొన్నది.
తాజాగా బుధవారం అభిషేక్ బచ్చన్ కూడా కోర్టు మెట్లు ఎక్కారు. తన పబ్లిసిటీ పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని ఐశ్వర్య మాదిరిగానే అభిషేక్ బచ్చన్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారు…
పర్మిషన్ లేకుండా తన ఫొటోను, పేరును ఉపయోగిస్తూ వస్తువులను విక్రయిస్తున్నారంటూ అభిషేక్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా అభిషేక్ ఫొటోలను ఆశ్లీల కంటెంట్ కోసం వినియోగిస్తున్నట్లు లాయర్ పేర్కొన్నారు. కోర్టులో ఐశ్వర్యరాయ్‌కు ఊరట లభించింది. అనుమతి లేకుండా ఐశ్వర్య ఫొటోలను ఉపయోగించడానికి వీలులేదంటూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే రకమైన కేసుతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వేర్వేరు రోజుల్లో కోర్టుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Also Read – Vayuputra: వంద కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత యానిమేషన్ మూవీ.. తండేల్ డైరెక్టర్ ట్విస్ట్
విడాకులు తీసుకుంటున్నారా?
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మధ్య మనస్పర్థలు మొదలైనట్లు, వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ ప్రేమలో పడ్డట్లు, ఆమె కారణంగానే అభిషేక్, ఐశ్వర్య మధ్య గొడవలు మొదలైనట్లు బాలీవుడ్‌లో పుకార్లు వినిపించాయి.
అభిషేక్ లేకుండా…
అభిషేక్ బచ్చన్ లేకుండా ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి కొన్ని సినిమా వేడుకలు, అవార్డ్స్ ఈవెంట్‌కు అటెండ్ కావడం విడాకుల వార్తలకు బాలాన్ని చేకూర్చింది. ఇప్పటివరకు ఈ పుకార్లను బచ్చన్ ఫ్యామిలీలోని ఎవరూ ఖండించలేదు.
పొన్నియన్ సెల్వన్…
2007లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వివాహం జరిగింది. వీరికి కూతురు ఆరాధ్య ఉంది. చివరగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వల్‌లో నటించింది ఐశ్వర్యరాయ్. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో నటించింది. 2023లో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది ఐశ్వర్యరాయ్.
Also Read – Mobile Phone:టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా..అయితే ఈ రోగం వచ్చి తీరుతుందంతే..!


