Raavana Movie Updates: కన్నప్ప (Kannappa) తర్వాత మరో పౌరాణిక కథపై మనసు పడ్డాడు మంచు విష్ణు. ఈ సారి ఏకంగా పాన్ ఇండియన్ యాక్టర్స్‌తో బిగ్ బడ్జెట్ మూవీ చేయాలనుందని అన్నాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ మైథలాజికల్ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ గెస్టులుగా కనిపించారు. ప్రభాస్ క్రేజ్ కారణంగా కన్నప్పకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. సినిమాపై వచ్చిన నెగెటివ్ టాక్ కారణంగా లాంగ్ రన్‌లో నిలవలేకపోయింది. 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 25 కోట్ల వరకు (Kannappa Collections) వసూళ్లను రాబట్టింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
రావణ మూవీ…
కాగా కన్నప్ప ప్రమోషన్స్‌లో మరో మైథాలజీ మూవీ రావణ (Ravana) గురించి మంచు విష్ణు చేసిన కామెంట్స్ తాలూకు వీడియో ఒకటిప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లంకాధిపతి రావణాసురుడి జననం నుంచి మరణం వరకు ఆయన జీవితంలోని కీలక ఘట్టాలతో రావణ పేరుతో ఓ స్క్రిప్ట్‌ను తాను 2009లో రెడీ చేసుకున్నానని మంచు విష్ణు అన్నాడు. ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం కోలీవుడ్ హీరో సూర్యను (Suriya) తీసుకోవాలని ఆయన్ని కలిసి కథ కూడా వినిపించానని మంచు విష్ణు చెప్పాడు. సీత పాత్ర కోసం అలియాభట్‌ను (Alia Bhatt) అనుకున్నాం. రావణ సినిమాకు కే రాఘవేంద్రరావును (K Raghavendra Rao) దర్శకుడిగా ఖరారు చేశాం. టైటిల్ పాత్రలో మా నాన్న మోహన్‌బాబు (Manchu Mohan Babu) నటించాల్సింది. కానీ బడ్జెట్ పరమైన కారణాల వల్ల రావణ ఆగిపోయిందని మంచు విష్ణు చెప్పాడు.
Also Read – AP Liquor Case: వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్…
అన్ని కుదిరితే ఇప్పుడు రావణను సెట్స్‌పైకి తీసుకురావాలని ఉందని మంచు విష్ణు అన్నాడు. ఈ సినిమాలో హనుమాన్‌గా తానే నటిస్తానని చెప్పాడు. కోలీవుడ్ హీరో కార్తీ… ఇంద్రజీత్‌గా, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్ నందమూరి సరిపోతారని చెప్పాడు. జఠాయువు పాత్ర కోసం సత్యరాజ్ అయితే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాడని అన్నాడు. రావణ సినిమా గురించి మంచు విష్ణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
రామాయణాన్ని వక్రీకరించద్దు…
అయితే రావణ సినిమా గురించి మంచు విష్ణు చేసిన కామెంట్స్, వైరల్ అవుతోన్న వీడియోపై నెటిజన్ల రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. రావణ సినిమాను రామాయణాన్ని వక్రీకరించద్దంటూ కామెంట్స్ పెడుతోన్నారు. మైథలాజికల్ సినిమాలు కాకుండా కమర్షియల్ సినిమాలు చేయడం బెటర్ అంటూ పేర్కొంటున్నారు.
Also Read – School Holidays: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపు సెలవు!


