Chiranjeevi: సినిమాల విషయంలో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేసిన చిరంజీవి… మన శంకర వరప్రసాద్‌గారుతో బిజీగా ఉన్నాడు. అలాగే డైరెక్టర్ బాబీతో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న చిరంజీవి, బాబీ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
డిసెంబర్‌లో సెట్స్‌పైకి…
మన శంకర వరప్రసాద్‌గారు అక్టోబర్‌లో పూర్తి కానున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తయిన వెంటనే బాబీ మూవీని పట్టాలెక్కించాలని చిరంజీవి ప్లాన్ చేశారట. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే బాబీ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్లు టాక్.
దసరా కానుకగా అక్టోబర్ 2న చిరంజీవి, బాబీ మూవీని అఫీషియల్‌గా లాంఛ్ చేయబోతున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ భారీ బడ్జెట్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. డెబ్యూ మూవీ కావడంతో ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని కేవీఎప్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తుందట. టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలతో పాటు, టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఈ లాంఛింగ్ ఈవెంట్‌కు హాజరు కానున్నట్లు సమాచారం.
Also Read – Raksha Gowda: కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతున్న గుప్పెడంత మనసు బ్యూటీ
మంచు మనోజ్ విలన్…
చిరంజీవి హీరోగా నటిస్తున్న 158వ సినిమా ఇది. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాబీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కాగా చిరంజీవి సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల రిలీజైన మిరాయ్‌తో కమ్ బ్యాక్ ఇచ్చాడు మనోజ్. విలన్ పాత్రలో అదరగొట్టాడు. మహీవార్ లామా క్యారెక్టర్‌లో మనోజ్ విలనిజాన్ని పండించిన తీరు, డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకున్నాయి.
బాబీతో అనుబంధం…
మిరాయ్ సక్సెస్‌తో చిరంజీవి సినిమాలో మనోజ్‌ను విలన్‌గా తీసుకోవాలని డైరెక్టర్ బాబీ ఫిక్సైనట్లు సమాచారం. మంచు మనోజ్‌తో బాబీకి చక్కటి అనుబంధం ఉంది. డైరెక్టర్‌గా తనకు ఫస్ట్ ఆఫర్ మంచు మనోజ్ ఇచ్చాడని, తాను డైరెక్టర్ అవుతానని నమ్మిన వాళ్లలో మనోజ్ మొదటి వ్యక్తి అని ఇటీవల మిరాయ్ సక్సెస్ మీట్‌లో బాబీ పేర్కొన్నాడు. మనోజ్‌తో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు. అన్నట్లుగానే చిరంజీవి సినిమాలో విలన్‌గా ఆఫర్ ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్నారు. హీరో పాత్రకు ధీటుగా మంచు మనోజ్ క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. ఓపెనింగ్ రోజు మనోజ్ విలన్ పాత్రపై క్లారిటీ రానున్నట్లు చెబుతున్నారు. మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చిరంజీవి, బాబీ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించబోతున్నాడు.
Also Read – Bigg Boss Elimination: తారుమారవుతున్న ఓటింగ్స్.. డేంజర్ జోన్లో ముగ్గురు కామనర్స్..!


