Dacoit Movie: అడవి శేష్, మృణాల్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డారా..? అవుననే తాజా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా డెకాయిట్. క్రేజీ ప్రాజెక్ట్‌గా ఇది రాబోతోంది. హిట్ 3 మూవీలో క్లైమాక్స్ లో కనిపించిన శేష్.. స్క్రీన్ మీద ఉన్న కాసేపైనా అద్భుతమైన పర్ఫార్మెస్ ని కనపరిచారు. వాస్తవంగా చెప్పాలంటే అడవి శేష్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా లాంటి సినిమాలో శేష్ నెగిటివ్ రోల్ పోషించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షణం సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. శేష్ మల్టీ టాలెంటెడ్. ఆయనకి.. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మూవీ మేకింగ్ మీద బాగా పట్టుంది. అందుకే, కమర్షియల్ సినిమా జోలికి వెళ్ళకుండా హాలీవుడ్ తరహా కథలను రాసుకొని వాటినే చేస్తున్నాడు.
Also Read – Ambati Rambabu: హరిహరవీరమల్లు హిట్టై కనకవర్షం కురవాలి – ట్వీట్‌తో షాకిచ్చిన అంబటి రాంబాబు
క్షణం, గూఢాచారి, హిట్ 2, మేజర్ లాంటి సినిమాలు చూస్తే అడవి శేష్ ఏంటో అర్థమవుతుంది. గూఢచారి సీక్వెల్ మూవీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమా చేస్తున్నారు. ముందు ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. కానీ, పలు కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంటే తన స్థానంలో మరో గ్లామర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది మృణాల్.
అయితే, ప్రస్తుతం ఆమె చేస్తున్న డెకాయిట్ షూటింగ్ దశలో ఉంది. తాజా సమాచారం మేరకు హీరో హీరోయిన్లు అడవి శేష్, మృణాల్ లకి బాగా గాయాలైనట్టు తెలుస్తోంది. డెకాయిట్ షూటింగ్ సెట్‌లో ఈ ఘటన జరిగిందట. అయినా కూడా గాయాలను లెక్క చేయకుండా ఇద్దరూ చిత్రీకరణను పూర్తి చేశారట. ఇదే డెకాయిట్ మూవీ సెట్స్‌లో గతంలోనూ ఓసారి ఇలాగే ప్రమాదానికి గురైయ్యారు. ఇప్పుడు రెండవసారి ప్రమాదం జరిగి గాయాలపాలైనట్టు సమాచారం. ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ యూనిట్ నుంచి మాత్రం వెల్లడి కాలేదు.
Also Read – Suriya Karuppu Teaser: రుద్రుడై వచ్చే దేవుడు.. యాక్షన్ రోల్‌లో సూర్య


