Vishal: కోలీవుడ్ హీరో విశాల్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తమిళ హీరోయిన్ సాయిధన్సిక మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. విశాల్, సాయిధన్సిక ఎంగేజ్‌మెంట్ చెన్నైలో శుక్రవారం జరిగింది. నిశ్చితార్థ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు విశాల్. తన పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చాడు విశాల్. నడిగర్ సంఘం భవనం మరో రెండు నెలల్లో పూర్తి కానుందని, అందులోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.
పదమూడేళ్ల గ్యాప్…
కాగా విశాల్ కంటే సాయిధన్సిక పదమూడేళ్లు చిన్నది. ఆగస్ట్ 29 నాటితో విశాల్‌కు నలభై ఎనిమిదేళ్లు కంప్లీట్ అయ్యాయి. సాయిధన్సిక వయసు 38 ఏళ్లు. విశాల్ 1977లో జన్మించగా… సాయిధన్సిక 1989లో పుట్టింది.
స్ట్రెయిట్ సినిమా చేయలేదు…
తమిళ సినిమాలతో విశాల్ కెరీర్ మొదలైంది. తెలుగులో ఇప్పటివరకు ఒక్క స్ట్రెయిట్ సినిమా చేయకపోయినా అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో విశాల్ హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులోకి అనువాదమయ్యాయి. పందెంకోడి, డిటెక్టివ్, మార్క్‌ఆంటోనీ తెలుగులోనూ హిట్టయ్యాయి.
కబాలితో ఫేమస్…
కాగా సాయిధన్సిక కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగులో కొన్ని స్ట్రెయిట్ సినిమాలు కూడా చేసింది. తొలుత మరీనా పేరుతో కెరీర్ మొదలుపెట్టింది సాయిధన్సిక. ఆ పేరు అంతగా కలిసి రాకపోవడంతో సాయిధన్సికగా మార్చుకుంది. రజనీకాంత్ కబాలి మూవీతో కోలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది. ఈ మూవీలో రజనీకాంత్ కూతురిగా యాక్షన్ రోల్‌లో కనిపించింది.
దక్షిణ… గత ఏడాది రిలీజ్…
కబాలి తర్వాత తమిళంతో పాటు తెలుగులో సాయిధన్సికకు చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ అవేవి విజయాలను సాధించలేదు. తెలుగులో షికారుతో పాటు అంతిమతీర్పు, దక్షిణ సినిమాలు చేసింది. దక్షిణ గత ఏడాది రిలీజైంది. సాయి ధన్సిక లీడ్ రోల్‌లో నటించిన ఐందమ్ వేదం అనే వెబ్ సిరీస్ ఐదో వేదంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
విశాల్, సాయిధన్సిక మధ్య పదమూడేళ్లగా పరిచయం ఉందట. కానీ తమ మధ్య ప్రేమ పుట్టి కొన్ని నెలలే అయ్యిందని సాయి ధన్సిక అన్నది. సాయిధన్సిక హీరోయిన్‌గా నటించిన యోగి దా సినిమా ఈవెంట్‌లో తమ ప్రేమాయణం గురించి విశాల్ బయటపెట్టి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.
Also Read – South Indian Heroines : గ్లామర్ రేసులో వెనుకబడుతున్న సౌత్ హీరోయిన్స్


