అక్కినేని యువ హీరో అఖిల్(Akhil) హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). సాక్షి వైద్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా 2023 ఏప్రిల్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. పాన్ ఇండియా చిత్రం విడుదలతైన ఈ మూవీ అన్ని భాషల్లో డిజాస్టర్‌గా నిలిచింది. అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను సోనీలివ్ దక్కించుకుంది.
అయితే అప్పటి నుంచి ఈ మూబీ ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. సుమారు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు స్ట్రీమింగ్ చేయలేదు. పలుమార్లు డేట్ ప్రకటించనప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను సోనీ లివ్ సంస్థ ప్రకటించింది. ఈనెల 14నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులు వీక్షించవచ్చని చెప్పింది. హిందీ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నూతన దర్శకుడు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.