Saturday, November 15, 2025
HomeTop StoriesPriyanka Mohan: AI ఒక శాపం, తాజా బాధితురాలు 'OG' హీరోయిన్!

Priyanka Mohan: AI ఒక శాపం, తాజా బాధితురాలు ‘OG’ హీరోయిన్!

Priyanka Mohan AI Viral Pics: టెక్నాలజీ ఎంత అడ్వాన్స్‌డ్ అవుతుందో, దాని దుర్వినియోగం కూడా అంతకంటే వేగంగా పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు సినిమా స్టార్స్‌కి, ముఖ్యంగా హీరోయిన్లకు పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం కొద్ది క్లిక్స్‌తో నకిలీ ఫోటోలు, వీడియోలు సృష్టించి, వాటిని వైరల్ చేస్తున్నారు కొందరు.

- Advertisement -

సాయి పల్లవి నుంచి ప్రియాంక మోహన్ దాకా…AI దెబ్బ
ఇటీవలి కాలంలో ఈ AI వేధింపులకు ఇద్దరు పాపులర్ హీరోయిన్లు బలయ్యారు.

సాయి పల్లవి: ఒక వెకేషన్ టైమ్‌లో ఆమెకు సంబంధించిన కొన్ని AI-క్రియేటెడ్ నకిలీ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగాయి. ఆ ఫోటోలు ఫేక్ అని ఆమె క్లారిటీ ఇచ్చినా, అవి చెయ్యాల్సిన డ్యామేజ్ చేసేశాయి.

ALSO READ:https://teluguprabha.net/gallery/priyanka-mohan-og-suvvi-suvvi-hot-stills-glamour/

ప్రియాంక అరుల్ మోహన్: ఇప్పుడు ఈమె వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీలోని ఆమె క్యారెక్టర్ లుక్‌ని పోలిన AI చిత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.’OG’ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య కన్మణి పాత్ర పోషించిన ప్రియాంక మోహన్, ఈ ఇష్యూపై వెంటనే రియాక్ట్ అయ్యారు.ఆమె తన X (ట్విట్టర్) అకౌంట్‌లో, “నకిలీ (Fake) AI చిత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి, దయచేసి వాటిని షేర్ చెయ్యకండి. AI ని మంచి క్రియేటివిటీకి వాడాలి, తప్పుడు సమాచారం ఇవ్వడానికి కాదు. మనం ఏం సృష్టిస్తున్నామో, ఏం షేర్ చేస్తున్నామో గమనించాలి” అని రిక్వెస్ట్ చేశారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/mitra-mandali-ua-certificate-family-entertainer/

కొద్ది రోజుల తర్వాత ‘నిజం’ ఎక్కడ ఉంటుంది?

ఈ టెక్నాలజీ వేగం చూస్తుంటే, ఒక భయంకరమైన ప్రశ్న ఎదురవుతోంది: మరికొన్ని రోజులకు, మనం చూస్తున్నది ‘రియల్’ కంటెంటా లేక AI సృష్టించిన ‘ఫేక్’ కంటెంటా అని సెలబ్రిటీలు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యే పరిస్థితి వస్తుందేమో! తమ ముఖం, తమ వాయిస్, తమ యాక్టింగ్ స్టైల్‌ని AI కాపీ కొట్టి, దాన్ని వేరే సందర్భంలో ప్రెజెంట్ చేస్తే… ‘అసలు ఇది నా పనేనా? కాదా?’ అని వాళ్ళే తెలుసుకోలేని స్థితి ఏర్పడుతుంది.
ఇది కేవలం నటీమణుల గౌరవానికి సంబంధించిన విషయం కాదు, పబ్లిక్‌కి సరైన సమాచారం చేరడానికి సంబంధించిన పెద్ద సమస్య. సోషల్ మీడియాలో దేన్ని నమ్మాలో, దేన్ని వదిలేయాలో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ AI ట్రెండ్ ఇక్కడితో ఆగాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad