Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAishwarya Lekshmi: సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పిన మరో బ్యూటీ..

Aishwarya Lekshmi: సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పిన మరో బ్యూటీ..

Aishwarya Lekshmi Social Media Quit: సినీ తారలు తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను తమ ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. పలు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంల్లో వారి ఫాలోయర్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అయితే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి సోషల్‌ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో బ్యూటీ కూడా అభిమానులకు అలాంటి షాకింగ్‌ న్యూస్‌నే ఇచ్చింది. 

- Advertisement -

నటనా పరంగా తమిళ నటి ఐశ్వర్య లక్ష్మీకి ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవల విడుదలైన తమిళ్‌ మూవీ ‘మామన్‌’.. తెలుగులో డబ్‌ అయి ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. ‘మామన్‌’లో ఐశ్వర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఒక్క యాక్టింగ్‌లోనే కాదు ప్రొడ్యూసర్‌గా సైతం ఐశ్వర్య తన ప్రతిభను నిరూపించుకుంది. కాగా సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. నెట్టింటికి పూర్తిగా దూరమవుతున్నట్లు శనివారం ప్రకటించింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/nandamuri-balakrishna-latest-movies-updates-on-dasara/ 

ఈ సందర్భంగా ఐశ్వర్య తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది.’ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి తాను మొద‌ట్లో అనుకున్నా.. కానీ కాలంతో పాటు మ‌న‌ము కూడా అప్‌డేట్ అవ్వాలన్న ఆలోచన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.’ అని ఐశ్వ‌ర్య తెలిపింది. అంతేకాకుండా ‘ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను సోషల్ మీడియాకు బానిసగా మారిపోయానని అర్థమైంది. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నా’. అని వెల్లడించింది.

తన పని, పరిశోధనలపై దృష్టి పెట్టకుండా, సోషల్ మీడియా తన ఆలోచనలను దారి మళ్లించిందని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది. ‘సోష‌ల్ మీడియా కారణంగా నాలోని క్రియేటివిటీ పోయింది. నెగిటివిటీని పెరగడంతో పాటు ఒక స‌ర్కిల్‌లో లాక్ అయిపోయాను. నాకు నేను ఏదో ఒక సూపర్ నెట్‌గా మారిపోవడం ఇష్టం లేదు. ఒక మహిళగా, నేను చాలా కష్టపడి నన్ను నేను మెరుగుపరుచుకున్నా. అందుకే సోష‌ల్ మీడియాకి లొంగిపోవడానికి నేను ఇష్టపడలేదు’. అని  చెప్పుకొచ్చింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/anushka-shetty-announces-break-from-social-media-details-here/

ప్రస్తుతం నడుస్తున్న ఈ సోషల్‌ మీడియా యుగంలో ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటే ప్రపంచం తనను మర్చిపోతుందనే రిస్క్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు ఐశ్వర్య పేర్కొంది. ‘నాలోని ఆర్టిస్ట్‌ని, నాలో ఉన్న చైల్డిష్‌ మెంటాలిటీని కాపాడుకోవడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను సోషల్‌ మీడియా నుంచి పూర్తిగా అదృశ్యమవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’. అని పోస్ట్‌ చేసింది.

భవిష్యత్తులో మరింత అర్థవంతమైన బంధాలను ఏర్పరుచుకోవడంతో పాటు, మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది. తాను నిజంగా మంచి సినిమా చేస్తే, ప్రేక్షకులు, అభిమానులు పాత తరహాలోనే ప్రేమను పంచుతారని ఆశిస్తున్నానంటూ ఐశ్వ‌ర్య తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad