Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభAishwarya Lekshmi : చిన్నప్పుడు ఒకతను లైంగికంగా వేధించాడు..

Aishwarya Lekshmi : చిన్నప్పుడు ఒకతను లైంగికంగా వేధించాడు..

- Advertisement -

Aishwarya Lekshmi : మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్, మలయాళం, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది. ఏకంగా ఈ సంవత్సరం ఐశ్వర్య లక్ష్మి నటించిన 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇటీవల మట్టి కుస్తీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన మట్టి కుస్తీ సినిమా ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి చిన్నప్పుడు తను ఎదుర్కున్న ఓ చేదు సంఘటనని తెలిపింది.

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ”చిన్నప్పుడు ఒకసారి కేరళలోని గురువాయూర్ టెంపుల్ కి వెళ్ళాం. అక్కడ ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ వేధించాడు. అంతేకాక నాతో దురుసుగా ప్రవర్తించాడు. ఆ రోజు నేను పసుపు బట్టలు వేసుకున్నాను. ఆ సంఘటన జరిగాక చాలా రోజుల దాకా నేను పసుపు బట్టలు వేసుకోలేదు. అతని వల్ల అంతగా భయపడ్డాను” అని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News